Share News

PM Modi Ex Bodyguard: వెబ్ సిరిస్‌లో మోదీ మాజీ బాడీగార్డ్

ABN , Publish Date - Aug 22 , 2025 | 05:24 PM

కెమెరా అనుభవంపై లక్కీ బిష్ట్ మాట్లాడుతూ, ఇది పూర్తిగా తనకు కొత్త అని, ఎంతో ఎగ్జయింటింగ్‌గా ఉందని చెప్పారు. నిజమైన యుద్ధాల్లో సైనికుడిగా బాధ్యత నెరవేర్చాలి ఉంటుందని, ఎన్నో భయాలు, త్యాగాలు కూడా ఉంటాయని, తెరపైకి వచ్చినప్పుడు అవే భావోద్వేగాలను ప్రదర్శించాల్సి ఉంటుందని చెప్పారు.

PM Modi Ex Bodyguard: వెబ్ సిరిస్‌లో మోదీ మాజీ బాడీగార్డ్
Lucky Bisht

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాజీ బాడీగార్డ్ (PM modis Ex Bodygurard), రా (RAW) ఏజెంట్‌గా పనిచేసిన లక్కీ బిష్ట్ (Lucky Bisht) ఇప్పుడు నటుడిగా అరంగేట్రం చేశారు. నిజజీవిత పాత్రలో నటిస్తున్నారు. 'సేన-గార్డియన్స్ ఆఫ్ ది నేషన్' (Sena-Guardians of the Nation) అనే వెబ్‌సిరీస్‌లో ఒక అతిథి పాత్రను ఆయన పోషించారు.


దీనిపై లక్కీ బిష్ట్ మాట్లాడుతూ, ప్రత్యేక ఆహ్వానం మేరకు తాను ఈ వెబ్‌సిరీస్‌లో నటించినట్టు చెప్పారు. నిజమైన సైనికుడుని తెరపై చూపించాలని వెబ్‌సీరీస్ టీమ్ భావించిందని, నిజజీవితంలో తనకు ఉన్న మిలటరీ నేపథ్యం, మిలటరీ అనుభవం కారణంగా ఈ అవకాశం వచ్చిందని చెప్పారు.


కెమెరా అనుభవంపై లక్కీ బిష్ట్ మాట్లాడుతూ, ఇది పూర్తిగా తనకు కొత్త అని, ఎంతో ఎగ్జయింటింగ్‌గా ఉందని చెప్పారు. నిజమైన యుద్ధాల్లో సైనికుడిగా బాధ్యత నెరవేర్చాలి ఉంటుందని, ఎన్నో భయాలు, త్యాగాలు కూడా ఉంటాయని, తెరపైకి వచ్చినప్పుడు అవే భావోద్వేగాలను ప్రదర్శించాల్సి ఉంటుందని చెప్పారు. రెండూ వేర్వేరు అయినప్పటికీ సైనికుడిగా ఉన్న అనుభవలం వల్ల నటన తేలిక అవుతుందని వివరించారు. అది నిజజీవితమైతే, ఇది నటన అవుతుందన్నారు. వెబ్‌సీరీస్‌లోని ప్రతి ఒక్కరూ తన పట్ల ఎంతో ఆదరం చూపించారని, ఫ్రెండ్లీ వాతావరణలో చాలా తేలికగా, పనిని ఎంజాయ్ చేస్తూ నటించినట్టు చెప్పారు.


విక్రమ్ సింగ్ చౌహాన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ వెబ్‌సిరీస్‌లో యశ్‌పాల్ శర్మ, షిర్లే సేథియా, ఆనందేశ్వర్ ద్వివేది, రాహుల్ తివారీ, విజయ్ విక్రమ్ సింగ్, అనుపమ్ భట్టాచార్య, నీలు డోగ్రా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆనందేశ్వర్ ద్వివేది, విజయ్ కోషి నిర్మాతలుగా వ్యవహరించగా, అభిననంద్ ఆనంద్ దర్శకత్వం వహించారు. ఎంఎక్స్ ప్లేయర్‌ ఓటీటీలో ప్రస్తుతం ఈ షో స్ట్రీమింగ్ అవుతోంది.


ఇవి కూడా చదవండి..

50 గంటల అరెస్టుతో ఉద్యోగిని సస్పెండ్ చేస్తుంటే పీఎంలకు ఎందుకు వర్తించదు?

పార్లమెంట్‌లోకి ఆగంతకుడు.. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది

For More National News And Telugu News

Updated Date - Aug 22 , 2025 | 05:31 PM