ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Trump-Musk: ట్రంప్-మస్క్ ఊహించని షాక్.. ఒక్క ఫోన్ కాల్‌తో..!

ABN, Publish Date - Jun 12 , 2025 | 10:27 AM

అమెరికా అధ్యక్షుడు ట్రంప్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ వ్యవహారం చిలికి చిలికి గాలివానలా మారింది. బిగ్ బ్యూటిఫుల్ బిల్లును మస్క్ వ్యతిరేకించడంతో మొదలైన ఈ గొడవ.. టెస్లా అధినేత కొత్త పార్టీపై ప్రకటన చేసే వరకు వెళ్లింది.

Trump-Musk

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అపర కుబేరుడు ఎలాన్ మస్క్ మళ్లీ దోస్తులు అయిపోయారు. ట్రంప్ మీద తాను చేసిన ఆరోపణలపై టెస్లా అధినేత పశ్చాత్తాపం చెందారు. ప్రెసిడెంట్‌కు ఫోన్ కాల్ చేసిన ఆయన.. అనంతరం బహిరంగంగానే విచారం వ్యక్తం చేశారు. దీనిపై ట్రంప్ కూడా స్పందించారు. మస్క్‌ను ఆయన క్షమించారు. ఈ పరిణామాలపై ఆయన హర్షం వ్యక్తం చేశారని వైట్‌హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ లివిట్ తెలిపారు. గత వారం ట్రంప్ మీద పెట్టిన పోస్టుల విషయంలో తాను చింతిస్తున్నానని.. అవి చాలా దూరం వెళ్లాయంటూ ట్విట్టర్‌లో పెట్టిన కొత్త పోస్ట్‌లో మస్క్ రాసుకొచ్చారు. దీని కంటే ముందు ట్రంప్‌కు మస్క్ ప్రైవేటుగా ఫోన్ కాల్ చేశారని సమాచారం.

చిలికి చిలికి గాలివానలా..

‘ఎలాన్ మస్క్ క్షమాపణను డొనాల్డ్ ట్రంప్ అంగీకరించారు. ఆయన ఈ ప్రకటనను అభినందించారు. మా దృష్టి మొత్తం అమెరికా ప్రజల ప్రయోజనాల మీదే కొనసాగుతోంది’ అని వైట్‌హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ లివిట్ తెలిపారు. కాగా, ట్రంప్-మస్క్ వ్యవహారం ఈ మధ్య చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. యూఎస్ సర్కారు తీసుకొచ్చిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లును మస్క్ వ్యతిరేకించడంతో అధ్యక్షుడికి ఆయనకు మధ్య దూరం పెరిగింది. ఈ క్రమంలో ట్రంప్‌పై మస్క్ సంచలన ఆరోపణలు చేశారు. తన మద్దతు లేకపోతే ఆయన ఓటమి పాలయ్యేవారని అన్నారు. దీనిపై ట్రంప్ కూడా అంతే ఘాటుగా స్పందించారు. ఎన్నికల్లో గెలవడానికి మస్క్ అవసరం లేదంటూ కౌంటర్ ఇచ్చారు. కొత్త పార్టీ దిశగా ఆలోచనలు చేస్తున్నట్లు మస్క్ అనడంతో అసలు అమెరికాలో ఏం జరుగుతోందంటూ అంతా అటువైపు దృష్టి సారించారు. అయితే తాజాగా ట్రంప్‌కు మస్క్ సారీ చెప్పడం, ఆయన క్షమాపణను అధ్యక్షుడు అంగీకరించడంతో ఇక కాంట్రవర్సీకి చెక్ పడినట్లేనని విశ్లేషకులు అంటున్నారు.

ఇవీ చదవండి:

ఆన్‌లైన్‌లో బుక్‌ చేస్తే రాకెట్‌లో వచ్చేస్తుంది!

లాడెన్ పాక్ సైనిక నగరంలో ఎలా ఉండగలిగాడు

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 12 , 2025 | 10:36 AM