ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Donald Trump: మరో షాకిచ్చిన డొనాల్డ్ ట్రంప్..ఆ సుంకం 50 శాతానికి పెంపు

ABN, Publish Date - May 31 , 2025 | 09:24 AM

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఎప్పుడూ ఏదో ఒక వార్తల్లో ఉంటారు. తాజాగా స్టీల్‎పై సుంకం పెంపు విషయంలో సంచలన ప్రకటన చేసి హాట్ టాపిక్‎గా మారిపోయారు. దీనికి ముందు చైనా పూర్తిగా నిబంధనలను ఉల్లంఘిస్తోందని ఆరోపించారు ట్రంప్.

Donald Trump steel tariff

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి సంచలన ప్రకటన చేశారు. పెన్సిల్వేనియాలో జరిగిన ఓ ర్యాలీలో స్టీల్‌పై ప్రస్తుతం ఉన్న 25% సుంకాన్ని త్వరలోనే 50%కి పెంచనున్నట్లు తెలిపారు. ఇది తాత్కాలికం కాదని, వచ్చే వారం నుంచే అమల్లోకి రానుందని స్పష్టం చేశారు. ట్రంప్ చేసిన ప్రకటన జపాన్‌కు చెందిన నిప్పాన్ స్టీల్ (Nippon Steel), అమెరికన్ యుఎస్ స్టీల్ (US Steel) మధ్య జరిగిన భాగస్వామ్య ఒప్పందాన్ని ఆయన ప్రమోట్ చేస్తుండగా జరిగింది. ఈ రెండు కంపెనీలు కలిసి అమెరికాలో 70,000 ఉద్యోగాలను కల్పించేందుకు, అమెరికా ఆర్ధిక వ్యవస్థలోకి 14 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయని ట్రంప్ పేర్కొన్నారు.


స్టీల్ మార్కెట్‌లో

ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిన ఈ గ్రూప్ చాలా హ్యాపీగా ఉందన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎవరూ మీ పరిశ్రమను దోచుకోలేరని ట్రంప్ అన్నారు. 25% సుంకం ఉన్నప్పుడు కొంతవరకు ఆ అడ్డంకిని దాటి వచ్చేవారు. కానీ ఇప్పుడు 50% అయితే, ఎవ్వరూ దాటలేరని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ ప్రకటనతో ప్రపంచ వ్యాప్తంగా స్టీల్ మార్కెట్‌లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా చైనాకు ఇది పెద్ద షాక్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యధిక స్టీల్ ఉత్పత్తి, ఎగుమతులు చేసే దేశం చైనానే. 2018లో అమెరికా 25% టారిఫ్ విధించినప్పటి నుంచి చైనా నుంచి అమెరికాకు స్టీల్ ఎగుమతులు క్రమంగా తగ్గాయి.


చైనా ఒప్పందం ఉల్లంఘించిందా

ఇటీవల ట్రంప్ Truth Socialలో ఓ పోస్టు చేసి అందులో చైనా అమెరికాతో చేసిన ఒప్పందాన్ని పూర్తిగా ఉల్లంఘించిందన్నారు. మంచి మనిషిగా ఉండే యత్నం చేశామని, కానీ ఫలితం లేదని ట్రంప్ ఆరోపించారు. మేలో చైనా, అమెరికా మధ్య జరిగిన ట్రేడ్ డీల్ ప్రకారం, రెండూ 125% పైగా ఉన్న సుంకాలను తాత్కాలికంగా 90 రోజుల పాటు నిలిపివేయాలని నిర్ణయించారు. ఈ ఒప్పందం వల్ల చైనాలో అనేక పరిశ్రమలు మూసే పరిస్థితి నుంచి తప్పించుకుందన్నది ట్రంప్ వాదన. అయితే చైనా ఆ ఒప్పందాన్ని ఎలా ఉల్లంఘించిందో ట్రంప్ వివరంగా చెప్పలేదు.


రాజకీయ దృష్టితో

అమెరికన్ పరిశ్రమను తిరిగి బలపరిచే నాయకుడిగా తనను తాను ప్రజెంట్ చేసుకోవడానికి ఇది ఒక ఓ వ్యూహమైన నిర్ణయమని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విదేశీ కంపెనీలను నియంత్రించి, అమెరికా ఉద్యోగాలను కాపాడే ప్రయత్నం చేస్తానన్న వాగ్దానం కూడా ఆయన కొనసాగిస్తున్నారని చెబుతున్నారు. అయితే ట్రంప్ తీసుకునే ఈ విధానాలు ప్రపంచ వ్యాప్తంగా ట్రేడ్ టెన్షన్‌లకు దారితీయవచ్చనే ఆందోళన కూడా ఉంది.


ఇవీ చదవండి:

ప్రమాదంలో ప్రజలు.. కోల్పోనున్న హిందూ కుష్ హిమాలయాలు

నీట్ పీజీపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 31 , 2025 | 10:53 AM