ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Qatar Israel Attack: దోహాలో జరిగిన ఇజ్రాయెల్ దాడి..డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు

ABN, Publish Date - Sep 10 , 2025 | 06:50 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఖతార్ రాజధాని దోహాలో జరిగిన దాడిపై రియాక్ట్ అయ్యారు. ఈ దాడితో తనకు సంబంధం లేదని, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఆదేశించినట్లు ట్రంప్ తెలిపారు. ఇంకా ఏం చెప్పారో ఇక్కడ చూద్దాం.

Qatar Israel Attack

ఖతార్ (Qatar) రాజధాని దోహా(Doha)లో తాజాగా ఇజ్రాయెల్ (Israel) చేసిన దాడి ఘటన ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. మంగళవారం రాత్రి దోహాలోని కటారా జిల్లాలో ఒక్కసారిగా పేలుళ్ల శబ్దం వినిపించింది. ఈ దాడిలో ఆరుగురు మరణించగా, వారిలో ఒక ఖతారీ భద్రతా అధికారి కూడా ఉన్నారు. ఇజ్రాయెల్ టార్గెట్ హమాస్ నాయకులు ఉన్న రెసిడెన్షియల్ బిల్డింగ్‌లను కూల్చడం. ఖతార్ అధికారులు ఈ దాడిని భీభత్సం, పిరికి దాడి అని తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనతో మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.

ట్రంప్ రియాక్షన్

డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఈ దాడి గురించి స్పందిస్తూ ఇది నా నిర్ణయం కాదు, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తీసుకున్న నిర్ణయం అని క్లారిటీ ఇచ్చారు. తన సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్రూత్ సోషల్‌లో ఈ విషయం పోస్ట్ చేశారు. అమెరికా సైన్యం నుంచి ఈ దాడి గురించి సమాచారం అందిన వెంటనే, తాను తన ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్‌కాఫ్‌ను ఖతారీలకు సమాచారం ఇవ్వమని చెప్పానని, కానీ అప్పటికే ఆలస్యమైపోయిందని ట్రంప్ తెలిపారు.

విడుదల చేయడం

ట్రంప్ ఈ దాడిని విమర్శించారు. ఖతార్(Qatar) అమెరికాకు సన్నిహిత మిత్ర దేశం. ఇలాంటి ఏకపక్ష దాడికి ఇజ్రాయెల్‌కు అమెరికా సహాయపడదన్నారు. హమాస్‌ను తొలగించడం మంచి లక్ష్యమేనని, వాళ్లు గాజాలోని ప్రజల బాధలను ఆసరాగా చేసుకుంటున్నారని చెప్పారు. బందీలను విడుదల చేయడం మన లక్ష్యం, కానీ ఈ దాడి పద్ధతి సరికాదని ట్రంప్ అన్నారు.

ఖతార్‌తో ట్రంప్ చర్చలు

దాడి జరిగిన తర్వాత ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో (Benjamin Netanyahu) మాట్లాడారు. నెతన్యాహు శాంతిని కోరుకుంటున్నారని, ఈ ఘటన శాంతి కోసం ఒక అవకాశంగా మారవచ్చని ట్రంప్ తెలిపారు. అలాగే, ఖతార్ అమీర్, ప్రధాని షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్‌రహ్మాన్ ఆల్-థానీతో మాట్లాడి ఇలాంటివి ఖతార్ భూమిపై మళ్లీ జరగవని హామీ ఇచ్చారు.

ఖతార్ స్పందన ఏంటి?

ఖతార్ ప్రధాని షేక్ మొహమ్మద్ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. మా దేశంపై ఈ దాడి సరికాదు, దీనికి తగిన రీతిలో స్పందిస్తాం అని హెచ్చరించారు. ఖతార్ విదేశాంగ శాఖ సలహాదారు అల్ అన్సారీ, మాకు ఈ దాడి గురించి ముందే సమాచారం ఇచ్చారన్న వాదనలు నిరాధారం. దాడి జరిగినప్పుడే అమెరికా అధికారి నుంచి కాల్ వచ్చిందని Xలో పోస్ట్ చేశారు.

ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 10 , 2025 | 06:52 AM