ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Donald Trump: ఇరాన్‌పై దాడి తరువాత ట్రంప్ కీలక వ్యాఖ్యలు..

ABN, Publish Date - Jun 22 , 2025 | 12:18 PM

ఇరాన్ అణు సామర్థ్యాన్ని నాశనం చేయడమే తమ లక్ష్యమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అన్నారు. ఇరాన్‌లో మూడు కీలక అణు కేంద్రాలపై అమెరికా దాడుల అనంతరం ఇది అత్యంత సమర్థవంతమైన సైనిక ఆపరేషన్‌గా ట్రంప్ అభివర్ణించారు.

Donald Trump Iran

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఆదివారం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఇరాన్‌లోని మూడు కీలక అణు కేంద్రాలు ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్‌లపై అమెరికా సైన్యం సమన్వయంతో జరిపిన వైమానిక దాడులు జరిగిన కొన్ని గంటల తర్వాత ఈ ప్రసంగం జరిగింది. ఈ దాడులను అద్భుతమైన సైనిక విజయమని చెప్పిన ట్రంప్, ఇరాన్ అణు సామర్థ్యాన్ని నాశనం చేయడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. మధ్య ప్రాచ్యంలో గొడవలు సృష్టించే ఇరాన్ ఇప్పుడు శాంతి కోసం అడుగు వేయాలని సూచించారు.

ట్రంప్ హెచ్చరిక

ఒకవేళ శాంతి కుదరకపోతే, భవిష్యత్తులో మరిన్ని దాడులు జరుగుతాయని ట్రంప్ హెచ్చరించారు. ఇవి చాలా బలంగా ఉంటాయని, గుర్తుంచుకోవాలన్నారు. ఇరాన్‌లో ఇంకా చాలా లక్ష్యాలు మిగిలి ఉన్నాయి. ఈ రాత్రి జరిగిన దాడి అత్యంత కష్టతరమైనది, బహుశా అత్యంత ప్రమాదకరమైనది కూడా అని ట్రంప్ వైట్ హౌస్ నుంచి మాట్లాడారు. ఈ ఆపరేషన్ ఇరాన్‌తో ఇజ్రాయెల్‌కు జరుగుతున్న సంఘర్షణలో అమెరికా నేరుగా సైనికంగా జోక్యం చేసుకోవడం ఇదే మొదటిసారి. గత వారం రోజులుగా ఇజ్రాయెల్ ఇరాన్ గగన రక్షణ వ్యవస్థలు, క్షిపణి కేంద్రాలపై దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది.

ఇజ్రాయెల్

శాంతి నిర్ణయం త్వరగా జరగకపోతే మిగిలిన లక్ష్యాలపై కచ్చితత్వం, వేగం, నైపుణ్యంతో దాడులు చేస్తామని ట్రంప్ చెప్పారు. అంతేకాదు, ఇజ్రాయెల్‌తో కలిసి పనిచేసినందుకు ట్రంప్ ఆ దేశాన్ని, నాయకత్వాన్ని ప్రశంసించారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా ట్రంప్‎కి ధన్యవాదాలు తెలియజేశారు. మేము ఒక గొప్ప జట్టుగా పనిచేశాం. ఇజ్రాయెల్‌కు ఉన్న ఈ భయంకరమైన ముప్పును తొలగించడంలో చాలా దూరం వచ్చామన్నారు. ఇజ్రాయెల్ సైన్యం చేసిన అద్భుతమైన పనికి అభినందనలు తెలిపారు.

పెరిగిన ఉద్రిక్తత

ఈ దాడులకు ముందు అమెరికా శనివారం ఇరాన్‌తో దౌత్య పరంగా సంప్రదింపులు జరిపింది. ఈ దాడులు పరిమితంగా ఉంటాయని, ఇరాన్‌లో ప్రభుత్వ మార్పు కోసం కాదని తెలిపింది. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్‌వ్యూలో ట్రంప్, ఫోర్డో కేంద్రంపై ఆరు బంకర్ బస్టర్ బాంబులు, ఇతర కేంద్రాలపై 30 టోమహాక్ క్షిపణులు ప్రయోగించామని చెప్పారు. ఒక అమెరికా అధికారి తెలిపిన వివరాల ప్రకారం B2 స్టెల్త్ బాంబర్‌లు ఫోర్డోపై బాంబులు వేశాయని అన్నారు. ఈ దాడులతో మధ్యప్రాచ్య ఘర్షణ మరో కొత్త మలుపు తిరిగింది. ఇజ్రాయెల్‌తో కలిసి అమెరికా ఈ చర్యలు చేపట్టడం ఉద్రిక్తతలను మరింత పెంచిందని చెప్పవచ్చు.

ఇవీ చదవండి:

గుడ్ న్యూస్.. ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్ వడ్డీ రేట్ల తగ్గింపు

ఈ యాప్ 20 లక్షల పోయిన ఫోన్‌లను గుర్తించింది.. ఎలాగంటే..

మరిన్ని ఏపీ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 22 , 2025 | 12:18 PM