Canada visa news: కెనడా కఠిన నిబంధనలు.. భారతీయులపై తీవ్ర ప్రభావం..
ABN, Publish Date - Nov 03 , 2025 | 09:08 PM
అంతర్జాతీయ విద్యార్థులపై కెనడా విధించిన కఠిన నిబంధనలు భారతదేశంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. భారత్‌కు చెందిన విద్యార్థులు అమెరికా తర్వాత కెనడాకు వెళ్లేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు.
అంతర్జాతీయ విద్యార్థులపై కెనడా విధించిన కఠిన నిబంధనలు భారతదేశంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. భారత్‌కు చెందిన విద్యార్థులు అమెరికా తర్వాత కెనడాకు వెళ్లేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. అయితే తాత్కాలిక వలసదారుల సంఖ్యను తగ్గించడానికి, విద్యార్థి వీసాలకు సంబంధించిన మోసాలను పరిష్కరించడానికి కెనడా ఈ ఏడాది ప్రారంభంలో వీసా జారీలను తగ్గించింది. 2024లో కూడా కెనడా వీసా జారీలను తగ్గించింది (Indian applicants rejected).
కెనడా తీసుకున్న ఈ నిర్ణయంతో ఆ దేశానికి వెళ్లాలనుకుంటున్న భారతీయులు ఇబ్బందులు పడుతున్నారు. భారత్ నుంచి కెనడా వీసా దరఖాస్తు చేసుకునే ప్రతి నలుగురిలో ముగ్గురి వీసాలు తిరస్కరణకు గురవుతున్నట్టు తాజా డేటా వెల్లడించింది. ఈ ఏడాది ఆగస్టులో కెనడియన్ పోస్ట్-సెకండరీ సంస్థలలో చదువుకోవడానికి అనుమతుల కోసం వచ్చిన భారతీయ దరఖాస్తులలో దాదాపు 74 శాతం తిరస్కరణకు గురయ్యాయి (Canada student visa).
మోసపూరిత అంగీకార లేఖలతో ముడిపడి ఉన్న దాదాపు 1,550 స్టడీ పర్మిట్ వీసాలను కెనడియన్ అధికారులు 2023లో కనుగొన్నారు (Canada immigration rate). వీటిలో ఎక్కువ భాగం భారతదేశం నుంచి వచ్చినవేనని కెనడా ఇమ్మిగ్రేషన్ విభాగం తేల్చింది. దీంతో భారత్ నుంచి వచ్చే స్టడీ పర్మిట్ వీసాలపై కెనడా అధికారులు సమగ్రంగా దృష్టి సారించి పరీక్షిస్తున్నారు. కాగా, భారతీయ విద్యార్థుల స్టడీ పర్మిట్ దరఖాస్తులను కెనడా తిరస్కరించడం తమ దృష్టికి వచ్చిందని, అయితే స్టడీ పర్మిట్‌లను జారీ చేయడం కెనడా ప్రత్యేక హక్కు అని ఒట్టావాలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది.
ఇవి కూడా చదవండి
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనులపై సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ ఫోకస్
అడగడానికి ఇంకేమీ ప్రశ్నలు లేవా... నాయకత్వ మార్పుపై సిద్ధరామయ్య
Updated Date - Nov 03 , 2025 | 09:08 PM