Booker Prize 2025: కామన్ మ్యాన్ కథకు ఫిదా.. డేవిడ్ సలైకు ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్..
ABN, Publish Date - Nov 11 , 2025 | 07:19 AM
ఈ ఏడాదికి గానూ ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్ కెనడియన్-హంగేరియన్-బ్రిటీష్ రచయిత డేవిడ్ సలైను వరించింది. ఓ సాధారణ వ్యక్తి నేపథ్యంలో డేవిడ్ సలై రాసిన భావోద్వేగభరిత 'ఫ్లెష్' నవలకు ఈ అవార్డు దక్కింది.
ఈ ఏడాదికి గానూ ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్ కెనడియన్-హంగేరియన్-బ్రిటీష్ రచయిత డేవిడ్ సలైను వరించింది. ఓ సాధారణ వ్యక్తి నేపథ్యంలో డేవిడ్ సలై (David Szalay) రాసిన భావోద్వేగభరిత 'ఫ్లెష్' నవలకు ఈ అవార్డు దక్కింది. తుది పోరులో ఐదుగురు పోటీదారులను అధిగమించిన 51 ఏళ్ల డేవిడ్ సలై బుకర్ ప్రైజ్ దక్కించుకున్నారు. దీంతో అతడికి 50 వేల పౌండ్లు బహుమతిగా దక్కనున్నాయి (Booker Prize winner).
సుదీర్ఘంగా సాగే సాధారణ వ్యక్తి కథ 'ఫ్లెష్' నవల (Flesh novel). ఈ నవలలో రచయిత కొన్ని లైన్ల మధ్య ఖాళీలు ఉంచారు. ఈ నవలలో కథ ఆధారంగా ఆయా ఖాళీ లైన్లలో పాఠకుడు తన మానసిక స్థితి ఆధారంగా లోతైన భావాలు, సంఘర్షణలను ఊహించుకోవాల్సి ఉంటుంది. అయితే లైన్లను ఖాళీగానే వదిలేసినప్పటికీ ఆ సాధారణ వ్యక్తి కథలో ఏ జరిగిందో పాఠకుడు సులభంగానే ఉహించుకోగలుగుతాడు. కాగా, ఈ బుకర్ ప్రైజ్ కోసం ప్రపంచవ్యాప్తంగా మొత్తం 153 నవలలు పోటీ పడ్డాయి (David Szalay Flesh).
విజేతను నిర్ణయించేందుకు న్యాయనిర్ణతలు ఐదు గంటల పాటు సమావేశమై ఏకగ్రీవంగా 'ఫ్లెష్'కు ఓటేశారు (Booker Prize news). ఇంగ్లీష్‌లో రాసిన పుస్తకాలకు 1969 నుంచి ఈ బుకర్ ప్రైజ్‌ను ప్రకటిస్తున్నారు. ఇంగ్లీష్‌లో రాసినప్పటికీ ఆయా పుస్తకాలు యూకే, ఐర్లాండ్ దేశాల్లో తప్పకుండా పబ్లిష్ కావాలి. అలా అయితేనే పరిగణనలోకి తీసుకుంటారు. ఇక, ఇతర భాషల్లో రాసి ఇంగ్లీష్‌లోకి అనువాదమైన పుస్తకాలకు ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్‌ను ప్రకటిస్తారు.
ఇవి కూడా చదవండి:
పాక్ ఆర్మీ చీఫ్‌కు లబ్ధి చేకూర్చే రాజ్యాంగ సవరణ.. భగ్గుమన్న ప్రతిపక్షాలు
ఒహాయో గవర్నర్ ఎన్నికలు.. వివేక్ అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపిన ట్రంప్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Nov 11 , 2025 | 07:19 AM