ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Bangladesh Schools: బంగ్లా ప్రభుత్వ సంచలన నిర్ణయం.. పాఠశాలల్లో ఆ టీచర్ల నియామకాలు బంద్‌

ABN, Publish Date - Nov 04 , 2025 | 03:52 PM

బంగ్లాదేశ్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అక్కడి పాఠశాలల్లో మ్యూజిక్‌, పీఈటీ టీచర్ల నియామకాలను రద్దు చేస్తున్నట్లు బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో మ్యూజిక్, డ్యాన్స్ టీచర్లను నియమించాలని అక్కడి విద్యా మంత్రిత్వశాఖ ఇటీవల నిర్ణయం తీసుకుంది. అయితే..

Bangladesh News

ఇంటర్నెట్ డెస్క్: బంగ్లాదేశ్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అక్కడి పాఠశాలల్లో మ్యూజిక్‌, పీఈటీ టీచర్ల నియామకాలను రద్దు చేస్తున్నట్లు బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో మ్యూజిక్, డ్యాన్స్ టీచర్లను నియమించాలని అక్కడి విద్యా మంత్రిత్వశాఖ ఇటీవల నిర్ణయం తీసుకుంది. అయితే ఈ చర్యలను ఇస్లాం వ్యతిరేక అజెండాగా అభివర్ణించిన కొందరు ఛాందసవాదులు (Bangladesh Islamists) యూనస్‌ సర్కార్‌పై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా సృష్టించిన మ్యూజిక్‌, పీఈటీ ఉపాధ్యాయుల పోస్టులను రద్దు చేస్తున్నట్లు బంగ్లాదేశ్ విద్యాశాఖ అధికారి మసూద్ అక్తర్ ఖాన్‌ ప్రకటన విడుదల చేశారు. ఈ పోస్టులను రద్దు చేయడానికి గల కారణాలను మీడియా ప్రశ్నించింది. ఆయన మాత్రం సమాధానం ఇవ్వడానికి నిరాకరించారు.

బంగ్లాదేశ్ లో అక్కడి ఇస్లాం ఛాందసవాదుల చర్యల(Religious Extremism)పై స్థానిక మీడియా వర్గాలు పలు కథనాలను వెల్లడించాయి. యూనస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బంగ్లాలో ప్రభుత్వ నిర్ణయాల్లో ఈ ఛాందసవాదుల జోక్యం పెరిగిపోతోందని తెలిపాయి. ప్రభుత్వ నిర్వహణలోని ప్రాథమిక పాఠశాలల్లో కేవలం మతపరమైన టీచర్లనే నియమించాలని.. మ్యూజిక్‌, పీఈటీ టీచర్ల నియామకాలను(Bangladesh Education Crisis) రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారని స్థానిక మీడియా కథనాలు వెల్లడించింది.

తమ డిమాండ్లు నెరవేర్చకపోతే వీధుల్లోకి వచ్చి నిరసన చేపడతామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇటీవల బంగ్లాలో మహిళలకు సమాన హక్కుల కోసం చేసిన సిఫార్సులను కూడా ఇస్లామిస్ట్ గ్రూప్ హెఫాజత్-ఎ-ఇస్లాం(Islamist Pressure) అనే సంస్థ తీవ్రంగా ఖండించింది. దానికి వ్యతిరేకంగా పలు ప్రాంతాల్లో భారీ ర్యాలీలు నిర్వహించింది. బంగ్లాదేశ్ కూడా ఆఫ్ఘనిస్థాన్ తరహాలో మహిళల పట్ల వివక్షత చూపే దిశగా అడుగులు వేస్తుందని అక్కడి మీడియా వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి.


ఇవి కూడా చదవండి:

ఇంగ్లిష్ టెస్టులో విఫలం.. యూఎస్‌లో భారతీయ ట్రక్ డ్రైవర్లకు షాక్

చైనాతో తొలగిన ప్రతిష్టంభన.. శ్వేత సౌధం కీలక ప్రకటన

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 04 , 2025 | 03:52 PM