B2 Stealth Bomber: పుతిన్, ట్రంప్ మీటింగ్.. ఆకాశంలో దూసుకెళ్లిన బీ 2 బాంబర్
ABN, Publish Date - Aug 16 , 2025 | 09:05 AM
B2 Stealth Bomber: పుతిన్, ట్రంప్ భేటీ అవ్వడానికి ముందు ఓ ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. పుతిన్ అలాస్కా, యాంకొరేజ్‌లోని జాయింట్ బేస్ ఎమ్‌లెండర్ఫ్ రిచర్డ్‌సన్‌కు రాగానే ఆయన్ని రిసీవ్ చేసుకోవడానికి ట్రంప్ వెళ్లారు..
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నిన్న(శుక్రవారం) అమెరికాకు వెళ్లారు. అమెరికాలోని అలాస్కాలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అయ్యారు. దాదాపు మూడు గంటల పాటు ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి. ఉక్రెయిన్‌తో యుద్ధం గురించి ఎక్కువ సేపు చర్చించినట్లు తెలుస్తోంది. రెండు దేశాల అధినేతల మధ్య మూడు గంటల పాటు చర్చలు జరిగినా.. ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదని సమాచారం. ఉక్రెయిన్‌తో యుద్ధం గురించి ఎటూ తేలకుండానే చర్చలు ముగిశాయి.
పుతిన్, ట్రంప్ తలలపై బీ2 బాంబర్..
పుతిన్, ట్రంప్ భేటీ అవ్వడానికి ముందు ఓ ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. పుతిన్ అలాస్కా, యాంకొరేజ్‌లోని జాయింట్ బేస్ ఎమ్‌లెండర్ఫ్ రిచర్డ్‌సన్‌కు రాగానే ఆయన్ని రిసీవ్ చేసుకోవడానికి ట్రంప్ వెళ్లారు. ఇద్దరూ రెడ్ కార్పెట్ మీద నడుచుకుంటూ వెయిటింగ్ స్టేజి దగ్గరకు వెళుతున్నారు. ఇలాంటి సమయంలో ఆకాశంలో బీ 2 బాంబర్ చక్కర్లు కొట్టింది. పుతిన్, ట్రంప్ తలలపైనుంచి అది ఆకాశంలో దూసుకెళ్లింది. బీ 2 బాంబర్ మీద నుంచి వెళుతుంటే పుతిన్ పైకి చూసి నవ్వారు. ప్రస్తుతం ఇందుకు సంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ట్రంప్ కావాలనే చేశారా?
డొనాల్డ్ ట్రంప్ తన మాట వినని వారిపై కక్ష సాధించడానికి ఎంతకైనా తెగిస్తారని అందరికీ తెలిసిన విషయమే. ఉక్రెయిన్‌తో యుద్ధం విషయంలో ట్రంప్.. పుతిన్‌పై గుర్రుగా ఉన్నారు. యుద్ధం కొలిక్కిరాకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు కూడా. పుతిన్ అమెరికాలోకి రాగానే తమ దేశ యుద్ధ సామాగ్రితో ఏకంగా షో నిర్వహించారు. అంతటితో ఆగకుండా పుతిన్ తలపై అత్యంత శక్తివంతమైన ఫైటర్ జెట్ బీ 2 బాంబర్‌ను తిప్పటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పుతిన్‌ను భయపెట్టడానికే ట్రంప్ ఇలా చేశారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
వాట్ ఏ కోఇన్సిడెంట్.. 1947, 2025లో ఒకటే క్యాలెండర్..
ఇంటర్వ్యూలో ఊహించని పరిణామం.. క్యాండిడేట్ కోరిక విని హెచ్ఆర్ షాక్..
Updated Date - Aug 16 , 2025 | 09:12 AM