Striking Coincidence: వాట్ ఏ కోఇన్సిడెంట్.. 1947, 2025లో ఒకటే క్యాలెండర్..
ABN , Publish Date - Aug 16 , 2025 | 08:08 AM
Striking Coincidence: కేరళలోని కొట్టాయమ్ ప్రాంతానికి చెందిన బెల్లం వ్యాపారి పీసీ మ్యాథ్యూ ప్లేకితొట్టిల్ కంపెనీ ముద్రించిన క్యాలెండర్ అది. 1947 నాటి ఆగస్టు నెల లీఫ్‌ను ఎవరో ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టారు.
దేశ వ్యాప్తంగా నిన్న (శుక్రవారం) 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. గల్లీ గల్లీలో జాతీయ జెండాను ఎగరవేసి జనం తమ దేశ భక్తిని చాటుకున్నారు. ఇక, ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో ఓ ఫొటో తెగ వైరల్ అవుతోంది. అది 1947 నాటి క్యాలెండర్లోని లీఫ్ ఫొటో. అది కూడా ఆగస్టు నెలకు సంబంధించింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. 78 ఏళ్ల తర్వాత సేమ్ టు సేమ్ తేదీలు వచ్చాయి. 1947 ఆగస్టు నెలలోని తేదీలు.. 2025 ఆగస్టు నెలలోని తేదీలు సేమ్ టు సేమ్ ఉన్నాయి.
1947లో ఆగస్టు 15 శుక్రవారం వచ్చింది. 79 ఏళ్లకు 2025లో ఆగస్టు 15 శుక్రవారమే వచ్చింది. కేరళలోని కొట్టాయమ్ ప్రాంతానికి చెందిన బెల్లం వ్యాపారి పీసీ మ్యాథ్యూ ప్లేకితొట్టిల్ కంపెనీ ముద్రించిన క్యాలెండర్ అది. 1947 నాటి ఆగస్టు నెల లీఫ్‌ను ఎవరో ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఆ పోస్టు కాస్తా వైరల్‌గా మారింది. వైరల్‌గా మారిన ఆ పోస్టుపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘వావ్ అప్పుడు, ఇప్పుడు సేమ్ క్యాలెండర్ డేట్స్.. ఆశ్చర్యంగా ఉంది’.. ‘ఆ క్యాలెండర్ చూస్తుంటే.. మనం 1947లో ఉన్నట్లే ఉంది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఎర్రకోట వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా వింటేజ్ కారు
ఎర్రకోట దగ్గర జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో వింటేజ్ జీప్ వేగనార్ కారు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ కారును భూటాన్ రాజు 1965లో ఈ జీప్ వేగనార్‌ను అప్పటి భారత దేశ రాష్ట్ర పతి సర్వే పల్లి రాధాకృష్ణన్‌కు బహుమతిగా ఇచ్చారు. 2000 సంవత్సరంలో ఈ కారు అధికారికంగా ఇండియన్ ఆర్మీ వద్దకు చేరుకుంది. స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా ప్రతీ ఏడాది జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఆఫ్ ది ఢిల్లీ ఏరియా ఈ కారులోనే ఎర్రకోటకు చేరుకుంటారు.
ఇవి కూడా చదవండి
ఇంటర్వ్యూలో ఊహించని పరిణామం.. క్యాండిడేట్ కోరిక విని హెచ్ఆర్ షాక్..
అత్తగారి ఊరికి వెళ్లిన అల్లుడు.. ఊహించని షాక్..