Man Tied To Tree: అత్తగారి ఊరికి వెళ్లిన అల్లుడు.. ఊహించని షాక్..
ABN , Publish Date - Aug 16 , 2025 | 06:50 AM
Man Tied To Tree: ఆ గొడవ చినికి చినికి గాలి వానలా తయారైంది. అత్తింటి వారు అతడిపై దాడి చేశారు. విచక్షణా రహితంగా కొట్టారు. అంతటితో ఆగకుండా చెట్టుకు కట్టేసి మరీ కొట్టారు.
సరుకులు కొనడానికి అత్తగారి ఊరికి వెళ్లిన అల్లుడికి ఊహించని షాక్ తగిలింది. అత్తింటి వారు అతడ్ని చెట్టుకు కట్టేసి కొట్టారు. రాత్రంతా చెట్టుకే కట్టేసి ఉంచారు. ఈ సంఘటన ఒడిశాలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. గజపతి జిల్లాకు జలంత బాలియర్ సింగ్, సుభద్ర మల్బిసోయే భార్యా భర్తలు. భార్యాభర్తలిద్దరివీ పక్క పక్క ఊర్లే. ఓ రోజు బాలియర్ సింగ్ తన భార్యను దారుణంగా చితక్కొట్టాడు. ఈ విషయం అత్తింటి వారికి తెలిసింది.
వారు గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. గ్రామ పెద్దలు ఓ తీర్పు ఇచ్చారు. కొన్ని నెలల పాటు సుభద్ర పుట్టింటి దగ్గరే ఉండాలని ఆదేశించారు. ఇక, అప్పటినుంచి సుభద్ర పుట్టింట్లోనే ఉంటోంది. బాలియర్ సింగ్ భార్య రాకకోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే, సంవత్సరం అయినా సుభద్ర మాత్రం భర్త దగ్గరకు తిరిగిరాలేదు. గురువారం రాత్రి బాలియర్ సింగ్ సరుకులు కొనడానికి అత్తగారి ఊరికి వెళ్లాడు. అక్కడ అత్తింటి వారు అతడితో గొడవ పెట్టుకున్నారు.
ఆ గొడవ చినికి చినికి గాలి వానలా తయారైంది. అత్తింటి వారు అతడిపై దాడి చేశారు. విచక్షణా రహితంగా కొట్టారు. అంతటితో ఆగకుండా చెట్టుకు కట్టేసి మరీ కొట్టారు. అతడ్ని రాత్రంతా చెట్టుకే ఉంచేశారు. గ్రామస్తులు ఈ విషయంపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఉదయం పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. బాలియర్ సింగ్‌ను చెట్టునుంచి విడిపించారు. ఈ దారుణంపై దర్యాప్తు చేపట్టారు. ఇక, ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియా వ్యాప్తంగా వైరల్‌గా మారింది.
ఇవి కూడా చదవండి
జన్మాష్టమి కోసం గుజరాత్ ద్వారకలో ప్రత్యేక ఏర్పాట్లు
మరింతగా తగ్గిన బంగారం ధర.. ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..