Share News

Rain Allowance: ఇంటర్వ్యూలో ఊహించని పరిణామం.. క్యాండిడేట్ కోరిక విని హెచ్ఆర్‌ షాక్..

ABN , Publish Date - Aug 16 , 2025 | 07:26 AM

Rain Allowance: వర్షాకాలంలో ఆఫీసుకు వెళ్లాలనుకునేవారికి చుక్కలు కనిపిస్తున్నాయి. ప్రయాణ ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వచ్చే జీతాల్లో 30 శాతం ప్రయాణ ఖర్చులకే అయిపోతోంది.

Rain Allowance: ఇంటర్వ్యూలో ఊహించని పరిణామం.. క్యాండిడేట్ కోరిక విని హెచ్ఆర్‌ షాక్..
Rain Allowance

వర్షాకాలం వచ్చిందంటే చాటు ఓలా, ఊబర్, ర్యాపిడో ప్రయాణ ఛార్జీలు రెట్టింపు అయిపోతాయి. వర్షం పడ్డప్పుడు పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. ఒక్కోసారి సాధారణం కంటే మూడు రెట్లు ఎక్కువ ఇచ్చినా రైడ్ బుక్ అవ్వదు. ఆఫీసుకు వెళ్లాలనుకునేవారికి చుక్కలు కనిపిస్తున్నాయి. ఖర్చులు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. వచ్చే జీతాల్లో 30 శాతం ప్రయాణ ఖర్చులకే అయిపోతోంది. వర్షాకాలం కష్టాల్ని దృష్టిలో పెట్టుకుని ఓ యువకుడు వినూత్న నిర్ణయం తీసుకున్నాడు. ‘రెయిన్ అలవెన్స్’ ఇస్తేనే కొత్త ఉద్యోగంలో చేరడానికి డిసైడ్ అయ్యాడు. ఇంటర్వ్యూ చేసే హెచ్‌ఆర్‌ను ఇదే విషయం అడిగాడు. దీంతో ఆ హెచ్‌ఆర్ ఆశ్చర్యపోయాడు.


ఆ హెచ్‌ఆర్ తన రెడ్డిట్ ఖాతాలో ఈ సంఘటనకు సంబంధించి ఓ పోస్టు పెట్టాడు. ఆ పోస్టులో..‘నిన్న ఇంటర్వ్యూ కోసం ఓ వ్యక్తి వచ్చాడు. నేను అతడి ఎక్స్‌పీరియన్స్ గురించి అడినపుడు ‘నాకు రెయిన్ అలవెన్స్ కావాలి’ అని అన్నాడు. అతడేమంటున్నాడో నాకు అర్థం కాలేదు. అతడు వివరించి చెప్పాడు. ‘నాకు వర్షాకాలంలో ఎక్కువ జీతం ఇవ్వాలి’ అని అన్నాడు. కంపెనీలో అలాంటి పాలసీలు లేవని చెప్పా. ‘నేను ఆఫీస్‌కు రావాలంటే ఓలా, ఊబర్, ర్యాపిడో బుక్ చేసుకోవాలి.


వాటి ధరలు వర్షాకాలంలో ఆకాశాన్ని అంటేలా ఉంటాయి. ఒక వేళ రోడ్డు మీద నీళ్లు ఉంటే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. మీరు ఎక్కువ డబ్బులు ఇవ్వలేమంటే.. వర్షాలు పడ్డప్పుడు నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వండి. లేదంటే ఆఫీసుకు లేటుగా రావడానికైనా ఒప్పుకోండి’ అని అన్నాడు. ‘నీకసలు జాబ్ చేయాలన్న ఆసక్తి ఉందా’ అని ప్రశ్నించా. దానికి అతడు ‘ఉంది. కానీ, వర్షకాలంలో ప్రయాణ ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. జులై నెలలో అయితే ఖర్చు రెట్టింపు అయింది. ఓసారి మీరు కూడా చెక్ చేసుకోండి’ అని చెప్పాడు.


అతడు ఎంతో నిజాయితీగా అన్ని విషయాలు చెప్పాడు. అతడు వెళ్లిపోయిన తర్వాత నేను నా ప్రయాణ ఖర్చులు చెక్ చేసుకున్నా. జులై నెలలో రెట్టింపు అయ్యాయి. ఓలా, ఊబర్, ర్యాపిడో వాళ్లు సాధారణం కంటే 20 రూపాయలు ఎక్కువ తీసుకుంటున్నారు’ అని రాసుకొచ్చాడు.

HR.jpg


ఇవి కూడా చదవండి

రేపు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం, ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై చర్చకు అవకాశం

అత్తగారి ఊరికి వెళ్లిన అల్లుడు.. ఊహించని షాక్..

Updated Date - Aug 16 , 2025 | 07:44 AM