Share News

BJP Parliamentary Board : రేపు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం, ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై చర్చకు అవకాశం

ABN , Publish Date - Aug 16 , 2025 | 07:19 AM

న్యూఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో రేపు పార్లమెంటరీ బోర్డు సమావేశం జరుగబోతోంది. ఈ సమావేశంలో ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రధాని, అమిత్ షా, రాజ్‌నాథ్..

BJP Parliamentary Board :  రేపు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం, ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై చర్చకు అవకాశం
BJP Parliamentary Board

న్యూఢిల్లీ, ఆగస్టు 16 : భారతీయ జనతా పార్టీ (BJP) రేపు (ఆగస్టు 17) న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్లమెంటరీ బోర్డు సమావేశం జరుగబోతోంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై చర్చ జరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఇతర పార్లమెంటరీ బోర్డు సభ్యులు ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది.

ఆగస్టు 6న జరిగిన పాలక నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) నాయకులు ఏకగ్రీవంగా ఒక తీర్మానాన్ని ఆమోదించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 9న జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ఎన్డీఏ అభ్యర్థిని ఖరారు చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్.. కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు పూర్తి అధికారం ఇస్తూ ఆ తీర్మానాన్ని ఆమోదించారు.

Ex-Vice-President-of-India.jpg


ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ (74), జూలై 21, 2025న ఆరోగ్య కారణాలను చూపుతూ తన పదవికి రాజీనామా చేసిన విషయం విదితమే. ఉపరాష్ట్రపతి తన అధికారిక X ఖాతాలో చేసిన పోస్ట్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాజీనామా లేఖ సమర్పించారు. ఆ లేఖలో, 'ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వడానికి, వైద్య సలహాకు కట్టుబడి ఉండటానికి, రాజ్యాంగంలోని ఆర్టికల్ 67(a) ప్రకారం, తక్షణమే అమలులోకి వచ్చేలా భారత ఉపరాష్ట్రపతి పదవికి నేను రాజీనామా చేస్తున్నాను' అని రాశారు.

GwZKb2dagAAHtdL.jpegదీంతో భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ప్రకటించింది. ఒకవేళ ఎన్నికకు పోటీ జరిగితే, సెప్టెంబర్ 9న ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల మధ్య పార్లమెంట్ హౌస్ మొదటి అంతస్తులో పోలింగ్ జరుగుతుందని ఒక ప్రెస్ నోట్‌లో పేర్కొన్నారు.


ఇలా ఉండగా, ఆగస్టు 6, 2025న జరిగిన ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశంలో టీడీపీ నుంచి శ్రీకృష్ణదేవరాయలు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, జనసేన నుంచి బాలశౌరి హాజరయ్యారు. ప్రధాని మోదీ తీసుకునే నిర్ణయమే తమ నిర్ణయమని జనసేన ఎంపీ బాలశౌరి స్పష్టం చేశారు. ప్రధాని మోదీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని 'జనసేన' అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారని ఆయన వెల్లడించారు. ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై అంతిమ నిర్ణయం ప్రధాని మోదీకే విడిచిపెడుతున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ఇది టీడీపీ అధినేత చంద్రబాబు మాటగా ఆయన చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మరింతగా తగ్గిన బంగారం ధర.. ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

త్వరలో ఖనిజ రంగంలోకి సింగరేణి

Read Latest Telangana News and National News

Updated Date - Aug 16 , 2025 | 07:49 AM