Hyderabad: ట్రాఫిక్ మార్షల్స్.. పోలీసులకు ప్రత్యామ్నాయంగా రద్దీ ప్రాంతాల్లో విధులు
ABN , Publish Date - Aug 16 , 2025 | 07:26 AM
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఉదయం 7 గంటలకు మొదలయ్యే ట్రాఫిక్ ఇబ్బందులు అర్ధరాత్రి దాటేంత వరకు వెంటాడుతూనే ఉంటాయి. ఈ క్రమంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
- శిక్షణ పోలీసులది.. జీతాలు సంస్థలవి.. నగర సీపీ వినూత్న ప్రయోగం
హైదరాబాద్ సిటీ: హైదరాబాద్(Hyderabad)లో ట్రాఫిక్ కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఉదయం 7 గంటలకు మొదలయ్యే ట్రాఫిక్ ఇబ్బందులు అర్ధరాత్రి దాటేంత వరకు వెంటాడుతూనే ఉంటాయి. ఈ క్రమంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్(City Police Commissioner CV Anand) వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రత్యేకంగా కొన్ని ట్రాఫిక్ రద్దీ ప్రాంతాలను ఎంపిక చేసి, ఆయా ప్రాంతాల్లో సుమారు 100 మంది ట్రాఫిక్ మార్షల్స్‌ను రంగంలోకి దింపాలని నిర్ణయించారు.
శిక్షణ పోలీసులది.. జీతాలు సంస్థలవి..
పలు ఐటీ కంపెనీలు, పెద్ద కార్పొరేట్ ఆసుపత్రులు, జనసమ్మర్థం ఎక్కువగా ఉన్న ప్రైవేట్ సంస్థల వద్ద ప్రత్యేకంగా ట్రాఫిక్ మార్షల్స్‌ను ఏర్పాటు చేయాలని సీపీ నిర్ణయించారు. సిబ్బంది సరిపోకపోవడం, జంక్షన్ల వద్ద ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కష్టంగా ఉండటంతో ప్రైవేట్ సంస్థలు, కంపెనీల వద్ద పోలీసులు విధులు నిర్వహించడం కష్టంగా మారుతోంది. అలాంటి ప్రాంతాల్లో ఆయా సంస్థలే ముందుకు వచ్చి కొంతమంది సిబ్బందిని నియమించుకోవాలని సీపీ సూచించారు.

సీఎస్ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ)లో భాగంగా సిబ్బందిని నియమించుకుంటే.. వారిని ట్రాఫిక్ పోలీసులకు అనుసంధానం చేస్తామని సీపీ వెల్లడించారు. వారికి ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, విధులపై ప్రత్యేక శిక్షణ ఇచ్చి మార్షల్స్‌గా తయారు చేస్తామని పేర్కొన్నారు. సీపీ ఆదేశాలతో పదుల సంఖ్యలో సంస్థలు ముందుకొచ్చినట్లు తెలిసింది. మొత్తం 100 ట్రాఫిక్ మార్షల్స్‌ను ఎంపిక చేయాలని సీపీ నిర్ణయించగా, ఇప్పటికే 70 మందిని ఎంపిక చేసి సిటీ పోలీసులకు అనుసంధానం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మరింతగా తగ్గిన బంగారం ధర.. ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News