ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Australian PM Married Jodie: ఆ ప్రధానికి కొత్త 'జోడీ'.. మోదీ అభినందనలు.!

ABN, Publish Date - Nov 30 , 2025 | 07:46 AM

ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోని ఆల్బనీస్ నూతన వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. దీంతో ఆస్ట్రేలియా చరిత్రలో ప్రధాని హోదాలో పెళ్లి చేసుకున్న తొలివ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు.

Australian PM Anthony Albanese married his girlfriend Jodie Haydon

ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని ఆల్బనీస్(Australia PM Anthony Albanese) కొత్త వివాహ జీవితంలోకి అడుగుపెట్టారు. 62 ఏళ్ల అల్బనీస్‌కు.. తన స్నేహితురాలైన 42 ఏళ్ల జోడీ హేడెన్‌(Jodie Hayden)తో శనివారం పెళ్లి జరిగింది. దీంతో 120 ఏళ్ల ఆస్ట్రేలియా సమాఖ్య ప్రభుత్వ చరిత్రలో ప్రధాని హోదాలో వివాహం చేసుకున్న తొలి వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు.

మోదీ అభినందనలు..

కాన్‌బెర్రా(Canberra)లోని ప్రధాని అధికారిక నివాసమైన ది లాడ్జ్‌(The Lodge)లో జరిగిన ఆల్బనీస్, హేడెన్ వివాహానికి చాలా తక్కువ మంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. కానీ ఈ పెళ్లి విషయం ఎక్కడా బయటకు రాలేదు. వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నట్టు తామే స్వయంగా సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పంచుకున్నారు. దీంతో భారత ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) వీరికి శుభాకాంక్షలు తెలిపారు. 'కంగ్రాటులేషన్స్ టు మై గుడ్ ఫ్రెండ్. మీ దాంపత్య జీవితం శుభప్రదం కావాలి' అని ఎక్స్‌లో స్పందించారు.

అల్బనీస్‌కు 2000లో కార్మెల్ టిబట్ అనే మహిళతో తొలుత వివాహమైంది. అయితే.. ఈమెకు 2019లో విడాకులిచ్చారు. వీరికి ఓ కుమారుడూ ఉన్నాడు. ఆ తర్వాత.. ఐదేళ్ల క్రితం జరిగిన ఓ పార్టీలో హేడెన్‌ను కలిశారు అల్బనీస్. 2024లో ఆమెకు ప్రపోజ్ చేశారు. ఏడాది తర్వాత ఇలా మరోసారి వివాహబంధంలోకి అడుగుపెట్టారాయన(Anthony Albanese married his girlfriend Jodie Haydon). ఈ పెళ్లికి ఆల్బనీస్ పెంపుడు కుక్క ఉంగరం తీసుకురాగా.. హేడెన్ మేనకోడలు ఎల్లా(Elga) అనే ఐదేళ్ల చిన్నారి పుష్పగుచ్ఛం అందజేసింది.

ఇవీ చదవండి:

జెలెన్‌స్కీ ప్రధాన కార్యనిర్వాహక అధికారి తొలగింపు.. కారణమిదే.?

'ఇది విరాట్, సాయం కావాలి'.. రెండు రష్యా ట్యాంకర్లపై డ్రోన్ దాడి

Updated Date - Nov 30 , 2025 | 08:50 AM