Share News

Russian Oil Tankers: 'ఇది విరాట్, సాయం కావాలి'.. రెండు రష్యా ట్యాంకర్లపై డ్రోన్ దాడి

ABN , Publish Date - Nov 29 , 2025 | 08:19 PM

రష్యా ట్యాంకర్లపై దాడి జరిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్యాంకర్లపై దాడి జరిగిన వెంటనే అందులోని సిబ్బంది 'డ్రోన్ దాడి' అంటూ చెప్పడం వీడియోలో కనిపిస్తోంది.

Russian Oil Tankers: 'ఇది విరాట్, సాయం కావాలి'.. రెండు రష్యా ట్యాంకర్లపై డ్రోన్ దాడి
Russian tankers attacked

కీవ్: నల్ల సముద్రం (Black Sea)లో 'విరాట్', 'కైరోస్' అనే రెండు రష్యా ట్యాంకర్లపై శుక్రవారం అర్ధరాత్రి దాడులు జరిగాయి. అయితే ఈ దాడుల్లో రెండు ట్యాంకుల సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారని, కైరోస్ మునిగిపోయే ప్రమాదం ఉందని తెలుస్తోంది. ఈ విషయాన్ని టర్కీ ప్రభుత్వం శనివారం ధ్రువీకరించింది. నల్ల సముద్ర తీరం నుంచి 35 నాటికల్ మైళ్ల దూరంలో ఈ దాడి జరిగిందని తెలిపింది.


రష్యా ట్యాంకర్లపై దాడి జరిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్యాంకర్లపై దాడి జరిగిన వెంటనే అందులోని సిబ్బంది 'డ్రోన్ దాడి' అంటూ చెప్పడం వీడియోలో కనిపిస్తోంది. 'ఇది విరాట్.. సాయం కావాలి.. డ్రోన్ దాడి.. మేడే' అని సిబ్బంది అంటున్నట్టు రికార్డయింది. మైన్ గానీ, రాకెట్ కానీ, బహుశా డ్రోన్ కానీ, మానవరహిత సముద్ర వాహనం కానీ ఢీకొని ఉండవచ్చని టర్కీ ట్రాన్స్‌పోర్ట్ మంత్రి ఉబ్దుల్‌ఖాదిర్ ఒక ప్రకటనలో తెలిపారు.


దాడి ఉక్రెయిన్ పనే

కాగా, ఈ దాడి ఉక్రెయిన్ పనే అంటూ మీడియా కథనాలు వెలువడుతున్నాయి. మానవరహిత సముద్ర డ్రోన్‌తో ఈ దాడి జరిగాయని, రెండు ట్యాంకర్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఉక్రెయిన్ సెక్యూరిటీ వర్గాలను ఉటంకిస్తూ సీఎన్ఎన్ పేర్కొంది. ఇది రష్యా చమురు రవాణాకు గట్టి దెబ్బగా ఆ వర్గాలు పేర్కొన్నట్టు తెలిపింది.


ఇవి కూడా చదవండి..

శ్రీలంకలో అత్యవసర పరిస్థితి ప్రకటించిన ప్రభుత్వం

జెలెన్‌స్కీ ప్రధాన కార్యనిర్వాహక అధికారి తొలగింపు.. కారణమిదే.?

Updated Date - Nov 29 , 2025 | 08:45 PM