Share News

Sri Lanka: శ్రీలంకలో అత్యవసర పరిస్థితి ప్రకటించిన ప్రభుత్వం

ABN , Publish Date - Nov 29 , 2025 | 03:43 PM

శ్రీలంకలో మరోసారి అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. గతంలో ఆర్థిక మాంద్యం కారణంగా ఎమర్జెన్సీ విధించిన సంగతి తెలిసిందే. తాజాగా దిత్వా తుఫాన్ కారణంగా అత్యవరస పరిస్థితిని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.

Sri Lanka: శ్రీలంకలో అత్యవసర పరిస్థితి ప్రకటించిన ప్రభుత్వం
Sri Lanka flood disaster

ఇంటర్నెట్ డెస్క్: దిత్వా తుఫాను (Cyclone Ditwah) కారణంగా శ్రీలంక(Sri Lanka) చిగురుటాకులా వణికింది. ఈ ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో ఇప్పటి వరకు 123 మంది మరణించగా.. అనేక మంది గల్లంతయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో దేశంలో అత్యవసర పరిస్థితిని శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. వరదల వల్ల ఏర్పడిన విధ్వంసం కారణంగా తలెత్తిన అత్యవసర పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే దేశమమంతటా అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.


శనివారం శ్రీలంకను దాటిన దిత్వా(Cyclone Ditwah) తుఫాను 123 మందికి పైగా ప్రాణాలను బలిగొందని, విధ్వంసం, మౌలిక సదుపాయాలకు నష్టం వాటిల్లిందని ఆ దేశ అధికారులు తెలిపారు. 'దిత్వా శ్రీలంక నుండి భారత తీరం వైపు వెళ్లింది. ఈ క్రమంలో భారీ వర్షం, అధిక వేగంతో కూడిన గాలులు వీశాయి. ఈ తుఫాన్ కారణంగా ఇప్పటికే అనేక ప్రాంతాలు తీవ్రంగా నష్టపోయాయి. ఎంతో మంది జీవనం అస్తవ్యస్తంగా మారింది' అని వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ అతుల కరుణనాయకే మీడియాతో తెలిపారు.


ఇదే సమయంలో విపత్తు నిర్వహణ కేంద్రం (DMC) శనివారం ఓ ప్రకటనలో పలు విషయాలను వెల్లడించింది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయని( Sri Lanka flood disaster)యని తెలిపింది. 43వేల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని డీఎంసీ జనరల్‌ డైరెక్టర్‌ సంపత్‌ తెలిపారు. పోలీసులు, అధికారులు, రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి మరీ దయనీయంగా ఉందన్నారు. వందలమందిని తాత్కాలిక పునరావాసాలకు తరలించామని డీఎంసీ జనరల్‌ డైరెక్టర్‌ వెల్లడించారు.


ఇవి కూడా చదవండి...

స్లీపర్ బస్సులతో యాక్సిడెంట్స్.. రాష్ట్రాలన్నిటికీ ఎన్‌హెచ్‌ఆర్‌సీ కీలక సూచనలు

ఎయిర్‌బస్ ఏ320 మోడల్ విమానాల్లో సాంకేతిక లోపం.. 6 వేల వరకూ ఫ్లైట్స్‌పై ప్రభావం

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 29 , 2025 | 03:59 PM