Updating Aadhar Mobile Number: త్వరలో ఆధార్ కొత్త ఫీచర్.. ఇంటి నుంచే..
ABN , Publish Date - Nov 29 , 2025 | 03:02 PM
ఆధార్ కార్డులో మొబైల్ నెంబర్‌ను ఇంటి నుంచే మార్చుకునేందుకు వీలుగా యాప్‌లో కొత్త ఫీచర్‌ను తీసుకురానున్నట్టు యూఐడీఏఐ తాజాగా తెలిపింది. మరి ఈ ఫీచర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో తెలుసుకుందాం పదండి
ఇంటర్నెట్ డెస్క్: కొన్ని ముఖ్యమైన వివరాలను అప్‌డేట్ చేసుకునేందుకు ఆధార్ కేంద్రానికి వెళ్లడం తప్పనిసరి. కానీ అక్కడ పెద్ద క్యూలో నిలబడలేక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా దివ్యాంగులకు ఈ పరిస్థితి మరీ ఇబ్బందికరం. ఈ సమస్యకు పరిష్కారంగా యూనీక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఊడీఏఐ) ఓ కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది. ఇది అందుబాటులోకి వస్తే యూజర్లు తమ ఇంటి నుంచే యాప్ ద్వారా ఆధార్ కార్డులోని మొబైల్ నెంబర్‌ను అప్‌డేట్ చేసుకోవచ్చు. దీంతో, డాక్యుమెంట్స్ నింపడం, పెద్ద క్యూలైన్‌లల్లో నిలబడాల్సిన అగత్యం తప్పిపోతుంది (Aadhar Mobile Number Update From Home).
ఇందుకు సంబంధించి యాప్‌లో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తున్నట్టు యూఐడీఏఐ ఎక్స్ వేదికగా తెలిపింది. ఓటీపీ వెరిఫికేషన్, ఫేస్ ఆథెంటికేషన్ సాయంతో ఆధార్ యాప్ ద్వారా యూజర్లు తమ ఇంటి గడపదాటకుండానే ఫోన్ నెంబర్‌ను అప్‌డేట్ చేసుకోవచ్చు.
ప్రస్తుత నిబంధనల ప్రకారం, మొబైల్ నెంబర్ అప్‌డేట్ చేసుకునేవారు తప్పనిసరిగా ఆధార్ కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుందది. వెరిఫికేషన్ ప్రక్రియకు సంబంధించిన భద్రతా పరమైన కారణాల రీత్యా కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నిబంధనలను రూపొందించింది. అయితే, వృద్ధులు, అంగవైకల్యం ఉన్నవారు, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారు ఆధార్ కేంద్రాలను సందర్శించే క్రమంలో నానా రకాల ఇబ్బందులూ ఎదుర్కొంటున్నారు. చాలా సమయం కూడా వథా అవుతోంది. కానీ ఈ ఫీచర్ అమల్లోకి వచ్చాక సమస్యలన్నీ తొలగిపోనున్నాయి.
ఈ ఫీచర్ కోసం మొదట యూజర్లు తమ ఫోన్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ ద్వారా ఆథెంటికేషన్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తరువాత యాప్‌లోని ఇన్-బిల్ట్ ఫీచర్ ద్వారా ఫేస్ ఆథెంటికేషన్ పూర్తి చేయాలి. ఇలా రెండు అంచెల ఆథెంటికేషన్ విధానంతో సమాచార భద్రతకు ఎలాంటి ఢోకా ఉండదు.
ఇవి కూడా చదవండి...
స్లీపర్ బస్సులతో యాక్సిడెంట్స్.. రాష్ట్రాలన్నిటికీ ఎన్‌హెచ్‌ఆర్‌సీ కీలక సూచనలు
ఎయిర్‌బస్ ఏ320 మోడల్ విమానాల్లో సాంకేతిక లోపం.. 6 వేల వరకూ ఫ్లైట్స్‌పై ప్రభావం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి