Attack on Pak Outpost: పాకిస్థాన్ అవుట్‌పోస్ట్‌పై తాలిబన్ డ్రోన్ దాడి.. వీడియో వైరల్..
ABN, Publish Date - Oct 15 , 2025 | 05:46 PM
అఫ్గానిస్థాన్, పాకిస్థాన్ సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తతలు చెలరేగాయి. సరిహద్దు ప్రాంతాలు కాల్పులతో దద్దరిల్లుతున్నాయి. పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో ఏడుగురు మరణించినట్లు అఫ్గాన్ అధికారులు ధృవీకరించారు. పాక్ దాడికి దీటుగా తమ సైన్యం కూడా ప్రతిఘటిస్తోందని అఫ్గాన్ స్పష్టం చేసింది.
అఫ్గానిస్థాన్, పాకిస్థాన్ సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తతలు చెలరేగాయి. సరిహద్దు ప్రాంతాలు కాల్పులతో దద్దరిల్లుతున్నాయి. పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో ఏడుగురు మరణించినట్లు అఫ్గాన్ అధికారులు ధృవీకరించారు. పాక్ దాడికి దీటుగా తమ సైన్యం కూడా ప్రతిఘటిస్తోందని అఫ్గాన్ స్పష్టం చేసింది. అఫ్గాన్‌లోని జజాయ్ మైదాన్, షోర్కో, ఖైబర్ ప్రాంతాల్లో పాక్ దాడులకు తెగబడింది. పాక్ దాడితో అప్రమత్తమైన అఫ్గాన్ ఆర్మీ ఎదురు దాడికి దిగింది. పాకిస్థాన్ అవుట్ పోస్టులను అఫ్గాన్ ఆర్మీ పేల్చేసింది (Afghan Taliban drone attack).
పాకిస్థాన్ అవుట్ పోస్ట్‌పై తాలిబన్లు డ్రోన్ దాడికి పాల్పడ్డారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Taliban drone footage). ఈ దాడిలో చాలా మంది పాక్ సైనికులు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. అలాగే ఎంతో మంది సైనికుల ఆచూకీ ఇప్పటివరకు లభ్యం కాలేదట. స్పిన్ బోల్డాక్ గేట్ వద్ద తాలిబన్, పాకిస్థాన్ దళాల మధ్య జరిగిన కాల్పుల్లో 20 మంది తాలిబన్ ఫైటర్స్ మరణించినట్టు పాక్ సైన్యం చెబుతోంది. అయితే 15 మంది సామాన్య పౌరులు మరణించినట్టు అఫ్గాన్ పేర్కొంటోంది.
ఈ ఉదయం 4 గంటల ప్రాంతంలో స్పిన్ బోల్డాక్ ప్రాంతంలో పాక్ దళాలు, తాలిబన్ల మధ్య భారీ పోరాటం జరిగింది (Pakistan‑Afghanistan tensions). ఆ పోరాటంలో తాము విజయం సాధించామని, పదిహేను నిమిషాల్లోనే పాక్ సైనికులు లొంగిపోయారని తాలిబన్లు ప్రకటించుకున్నారు.
భారత్‌కు అఫ్గాన్ చేరువ కావడాన్ని పాక్ జీర్ణించుకోలేకపోతోంది. ఆ దేశ విదేశాంగ మంత్రి మన దేశంలో పర్యటిస్తున్న సమయంలోనే అఫ్గాన్‌లో పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది. ఇరు దేశాల మధ్య పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి, శాంతిని పునరుద్ధరించడానికి తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పలు దేశాల అధినేతలు పిలుపునిచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నకిలీ మద్యం కేసులో మరో కీలక పరిణామం
కొత్త డీజీపీగా ఓం ప్రకాశ్ సింగ్
దీపావళి పండగ ఎప్పుడు చేసుకోవాలి..?
For More National News And Telugu News
Updated Date - Oct 15 , 2025 | 06:14 PM