ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Pakistan Jail: పాకిస్తాన్‌కు షాక్.. జైలు నుంచి 200 మంది ఖైదీల పరార్..

ABN, Publish Date - Jun 03 , 2025 | 11:27 AM

పాకిస్తాన్‌లో జైల్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కరాచీలోని మాలిర్ జైల్లో ఖైదీలుగా ఉన్న వారిలో 200 మంది తప్పించుకున్నట్లు తెలుస్తోంది. సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది..

పాకిస్తాన్‌లో జైల్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కరాచీలోని మాలిర్ జైల్లో ఖైదీలుగా ఉన్న వారిలో 200 మంది తప్పించుకున్నట్లు తెలుస్తోంది. సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. జైలు ప్రవేశ ద్వారాన్ని బద్ధలుకొట్టి మరీ ఖైదీలు పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఖైదీలపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సుమారు 20 మంది ఖైదీలు చనిపోయినట్లు సమాచారం అందుతోంది.


పాకిస్తాన్‌లోని (Pakistan) కొన్ని ప్రాంతాల్లో మే 30వ తేదీన 4.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ క్రమంలో మాలిర్ జైలు (Malir Jail) పరిసర ప్రాంతాల్లో కూడా భూకంపం రావొచ్చన వార్తల నేపథ్యంలో పోలీసులు అలెర్ట్ అయ్యారు. జైల్లో ఉన్న ఖైదీలను మరో ప్రాంతానికి తరలించేందుకు చర్యలు తీసుకున్నారు. అయితే ఇదే అదునుగా భావించిన ఖైదీలు.. పోలీసులపై దాడి చేసి మరీ తప్పించుకున్నారు.


ఖైదీల పరారీ ఘటనతో కరచా వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జైలు పరిసర ప్రాంతాల్లో సాధారణ ప్రజలు ఎవరూ సంచరించవద్దని పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ ఘటనపై పోలీసు అధికారులు మాట్లాడుతూ, జైలును సీజ్ చేశామని తెలిపారు. అలాగే కరాచీలోని అన్ని ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ చేపట్టామన్నారు. ఈ ఘటనలో కొంతమంది ఖైదీలు, పోలీసులు గాయపడినట్లు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.


ఇవీ చదవండి:

నిప్పుతో చెలగాటం వద్దు.. అమెరికాపై మండిపడ్డ చైనా

వాస్తవాన్ని వివరించిన భారత్.. పాక్‌కు మద్దతు ఉపసంహరించిన కొలంబియా

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 03 , 2025 | 12:05 PM