Donald Trump : డొనాల్డ్ ట్రంప్‌కు.. 13 ఏళ్ల సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ బిగ్ హగ్..
ABN, Publish Date - Mar 06 , 2025 | 12:25 PM
Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ దేశ చరిత్రలో తొలిసారి 13 ఏళ్ల కుర్రాడిని యూఎస్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్‌గా నియమించిన సంగతి తెలిసిందే. ఈ అరుదైన గౌరవాన్ని కల్పించిన అధ్యక్షుడికి బిగ్ హగ్ ఇచ్చి..
Donald Trump Secret Service Agent Dj : క్యాన్సర్‌తో పోరాడుతున్న 13 ఏళ్ల 'డీజే' డేనియల్‌కు గౌరవ యునైటెడ్ స్టేట్స్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్‌గా నియమిస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. దీనితో ఈ బిరుదును పొందిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు డీజే. ట్రంప్ కాంగ్రెస్‌ను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సందర్భంగా ఈ ప్రకటన చేశారు. అప్పటికప్పుడే సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ సీన్ కరన్ డేనియల్‌కు అధికారిక బ్యాడ్జి అందించాడు. చట్ట ప్రకారం బాలుడు కల నెరవేర్చుకునే అవకాశం కల్పించారు.
డీజేకు ట్రంప్ ప్రత్యేక ఆహ్వానం..
సమావేశం తర్వాత సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ డీజే డేనియల్ ఓవల్ కార్యాలయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కలిశారు. ఈ గౌరవం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ బిగ్ హగ్ ఇచ్చాడు. ఈ క్షణాలను వైట్ హౌస్ Xలో షేర్ చేస్తూ,“13 ఏళ్ల డీజే డేనియల్ నిన్న రాత్రి జాయింట్ సెషన్‌లో సీక్రెట్ సర్వీస్ ఏజెంట్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత డీజేను ట్రంప్ ఓవల్ కార్యాలయానికి ఆహ్వానించారు. అక్కడ ప్రత్యేక ఏజెంట్ డేనియల్ అధ్యక్షుడికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ 'బిగ్ హగ్' ఇచ్చారని" క్యాప్షన్ జతచేసింది.
2018 నుంచి మెదడు క్యాన్సర్‍తో పోరాడుతున్నాడు డీజే. కేవలం 5 నెలలే జీవించే అవకాశం ఉందని వైద్యులు అప్పట్లోనే చెప్పినప్పటికీ పట్టు విడువకుడా ప్రాణాంతక వ్యాధితో ధైర్యంగా పోరాడుతున్నాడు. కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ప్రసగించే సమయంలో ఇదే విషయాలను ఉటంకిస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన స్ఫూర్తి కొనియాడాడు. అంతేకాదు, సీక్రెట్ ఏజెంట్ కావాలనే డేనియల్ ఆకాంక్ష చట్టబద్ధంగా నెరవేరేందుకు ఏర్పాట్లు చేయమని అధికారులను ఆదేశించారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు విపక్ష డెమొక్రటిక్ పార్టీ సభ్యులు చప్పట్లతో తమ సమ్మతి తెలిపారు.
Read Also : అమెరికా సీక్రెట్ సర్వీస్‌లో 13 ఏళ్ల బాలుడు.. ట్రంప్ ఆ పిల్లాడిని ఎందుకు నియమించారు..
Retaliatory Tariffs: 2 నుంచి భారత్‌పై ప్రతీకార సుంకాలు
డ్రిల్ బేబీ డ్రిల్.. ద్రవ్యోల్బణాన్ని ఓడిద్దాం.. కాంగ్రెస్ సమావేశంలో ట్రంప్..
Updated Date - Mar 06 , 2025 | 12:31 PM