UTI in Kids: చిన్నతనంలోనే మూత్రాశయ ఇన్ఫెక్షన్లు..! కారణమేంటి..?
ABN, Publish Date - Jul 15 , 2025 | 03:14 PM
మహిళలు ఏదొక వయసులో మూత్రాశయ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ప్రస్తుతం పసిపిల్లలు సైతం యూరినరీ ఇన్ఫెక్షన్లకు గురవుతున్నారు. అసలు చిన్నవయసులోనే అమ్మాయిల్లో ఈ సమస్య ఎందుకు వస్తోంది? ఏ లక్షణాల ద్వారా దీన్ని గుర్తించాలో తెలుసుకుందాం.
Causes of UTI in Young Girls: UTI అనేది ఒక సాధారణ సమస్య. ఇది సాధారణంగా మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఆరోగ్యం సరిగా లేకపోవడం, చికిత్స కోసం తీసుకునే మందులు, జీవనశైలి తదితర కారణాలు మూత్రాశయ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలను పెంచుతాయి. ఈ సమస్య వచ్చిన వెంటనే యాంటీబయాటిక్స్ తీసుకోవాలి. ఈ రోజుల్లో 5 నుంచి 6 సంవత్సరాల వయస్సు గల బాలికలు కూడా UTI బారిన పడుతున్నారు. చిన్న అమ్మాయిలు ఈ సమస్యకు ఎందుకు బలైపోతున్నారో ఇక్కడ తెలుసుకోండి.
పిల్లలలో UTI లక్షణాలు
జ్వరం, చిరాకు, ఆకలి లేకపోవడం, వాంతులు, మూత్రం గాఢంగా వాసన రావడం, మూత్ర విసర్జన చేసేటప్పుడు నొప్పి, తరచుగా మూత్రవిసర్జన చేయడం లేదా మూత్ర విసర్జన తగ్గడం, మూత్ర విసర్జనలో ఆటంకం వంటి లక్షణాలు పిల్లలు UTI బారిన పడ్డారనేందుకు సంకేతం.
UTI లకు కారణాలు
1) తరచుగా డైపర్లు మార్చకపోవడం
మురికి డైపర్‌ను ఎక్కువసేపు ధరించం వల్ల బ్యాక్టీరియా మూత్రనాళానికి వ్యాపించే అవకాశం అంత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీ బిడ్డ డైపర్‌లను తరచుగా మార్చడం గుర్తుంచుకోండి.
2) తప్పుడు క్లీనింగ్ పద్ధతులు
మూత్రవిసర్జన లేదా మలవిసర్జనకు వెళ్లినపుడు అమ్మాయిలు ముందు నుంచి వెనకకు శుభ్రం చేసుకోవాలి. అలా కాక కొందరు పెద్దలు తమ పిల్లలకు వెనక నుంచి ముందుకు గట్టిగా రుద్దుతూ శుభ్రం చేస్తారు. ఇలా చేయడం వల్ల పిరుదుల నుంచి మూత్రనాళం వరకూ బ్యాక్టీరియా ప్రయాణిస్తుంది. కాబట్టి, తప్పుడు క్లీనింగ్ పద్ధుతులు మూత్రనాళ సమస్యలకు దారితీస్తాయని గుర్తుంచుకోండి.
3) మూత్రాన్ని బిగపట్టుకోవడం
మూత్ర విసర్జన చేసేటప్పుడు మూత్రనాళంలో ఉండే బ్యాక్టీరియా మొత్తం బయటకు వెళ్లిపోతుంది. కానీ, చాలామంది పిల్లలు మూత్రవిసర్జన వస్తున్నా టాయిలెట్‌కి వెళ్లకుండా అలానే బిగపట్టుకుని గంటలతరబడి ఉంటారు. ఇలా చేస్తే బయటికి రావాల్సిన క్రిములు వెనక్కి వెళ్లిపోయి UTIకు కారణమవుతాయి.
4) తగినంత నీరు తాగకపోవడం
నీరు లేదా ద్రవ పానీయాలు తాగడం వల్ల మూత్రం పలుచన అవుతుంది. తరచుగా మూత్ర విసర్జన జరుగుతుంది. ఇది UTI ని నివారించడంలో సహాయపడుతుంది. శరీరంలో నీటి కొరత ఉంటే UTI సమస్య వచ్చే అవకాశముంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)వ
Also Read:
ఆహారం తింటున్నప్పుడు చెమట పడుతుందా? బీ కేర్ ఫుల్.!
ఆర్గానిక్ టీ vs టీ బ్యాగ్.. ఏ టీ మంచిదో తెలుసా?
For More Health News
Updated Date - Jul 15 , 2025 | 03:17 PM