Tea Bags Vs Organic Tea: ఆర్గానిక్ టీ vs టీ బ్యాగ్.. ఏ టీ మంచిదో తెలుసా?
ABN , Publish Date - Jul 15 , 2025 | 08:01 AM
చాలా మంది తమ అలసట తీరేందుకు ఒక కప్పు టీ తాగుతారు. అయితే ఆరోగ్యానికి ఏ టీ మంచిది? ఆర్గానిక్ టీ నా లేదా టీ బ్యాగ్ టీ నా.. ఈ విషయంపై ఆరోగ్య నిపుణులు ఏమి చెబుతారో తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: మన దేశంలో టీ చాలా మందికి ఇష్టమైన పానీయం. ఉదయం లేచిన వెంటనే కచ్చితంగా టీ ఉండాల్సిందే. అంతేకాకుండా, ఆఫీసులో బ్రేక్ టైమ్‌లో లేదా సాయంత్రం అలసటగా ఉన్నప్పుడు ఒక్క కప్పు టీ తాగితే చాలా రిలీఫ్‌గా ఉంటుంది. ఇలా టీ మన రోజువారీ జీవనశైలిలో ఒక భాగమైపోయింది. అయితే, ఇటీవల ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెరుగుతోంది. అందుకే చాలా మంది ఏ టీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది? టీ బ్యాగులతో చేసే టీ మంచిదా? లేదా ఆర్గానిక్ టీ మంచిదా అని ప్రశ్నిస్తున్నారు. అయితే, ఈ విషయంపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
టీ బ్యాగ్ టీ అంటే ఏమిటి?
టీ బ్యాగ్స్ అనేవి ప్రాసెస్ చేసిన టీ తో తయారవుతాయి. ఇవి తక్కువ ఖరీదుతో అందుబాటులో ఉంటాయి. తయారీకి సులభంగా ఉంటాయి. కానీ వీటిలో కొన్నిసార్లు రసాయనాలు, ప్రిజర్వేటివ్స్ ఉండే అవకాశం ఉంది. కొన్ని బ్రాండ్స్ ప్లాస్టిక్ వంటి పదార్థాలు కూడా వాడుతుండడం వల్ల అవి ఆరోగ్యానికి హానికరం కావచ్చు.
ఆర్గానిక్ టీ అంటే ఏమిటి?
ఆర్గానిక్ టీ అనేది ఎలాంటి రసాయనాలు లేకుండా సహజంగా పెరిగిన టీ ఆకులనుండి తయారవుతుంది. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్స్.. శరీరం నుండి విషపదార్థాలను తొలగించే లక్షణాలను కలిగి ఉంటాయి. అంతేకాకుండా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది.
నిపుణులు ఏమంటున్నారు?
వైద్యుల అభిప్రాయం ప్రకారం, టీ బ్యాగ్స్ తక్కువ ధరకు అందుబాటులో ఉన్నా ఆరోగ్యపరంగా ఆర్గానిక్ టీనే మంచిదని వారు సూచిస్తున్నారు. ముఖ్యంగా గర్భిణీలు, డయబెటిస్ ఉన్నవారు, లేదా గుండె సంబంధిత సమస్యలున్నవారు ఆర్గానిక్ టీని ఎంపిక చేసుకోవడం ఉత్తమం అని చెబుతున్నారు.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Also Read:
రోజూ ఈ 3 సూపర్ ఫ్రూట్స్ తింటే.. రోగాలు పరార్..!
ఈ మూడు అలవాట్లు పాటిస్తే చాలు.. వృద్ధాప్యం వచ్చినా పుష్టిగా ఉంటారు.!
For More Health News