Toor Dal Disadvantages: ఈ 5 సమస్యలున్న వ్యక్తులు కందిపప్పు తినకూడదు..!
ABN, Publish Date - Aug 15 , 2025 | 07:36 PM
పప్పుధాన్యాల్లో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా కందిపప్పు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. కానీ, ఈ 5 సమస్యలున్న వ్యక్తులు పొరపాటున కూడా కందిపప్పు తినకూడదు. ఎందుకంటే..
భారతీయుల వంటగదుల్లో కందిపప్పుకు ప్రత్యేక స్థానముంది. పప్పు ధాన్యాలు అన్నింటిలోకి దీనినే ఎక్కువగా ఉపయోగిస్తారు. కందిపప్పుతో రోజూ పప్పు, సాంబార్ ఇలా ఏదొక వంటకం చేసుకుని తింటుంటారు. ఎంతో రుచికరంగా ఉండే కందిపప్పులో పొటాషియం, విటమిన్ సి, బి6 ఐరన్, కాల్షియం, ప్రోటీన్, మెగ్నీషియం, డైటరీ ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. దీని వినియోగం బరువు తగ్గడానికి, ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేవి అయినప్పటికీ, ఈ 5 సమస్యలు ఉన్న వారు కందిపప్పుకు దూరంగా ఉండాల్సిందే..
కిడ్నీ సమస్యలు
ఈ రోజుల్లో చాలా మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటి వారు పప్పు ధాన్యాలు తినకూడదని నిపుణులు అంటున్నారు. దీనికి కారణం పప్పు ధాన్యాలలో అధిక మొత్తంలో పొటాషియం ఉంటుంది. కిడ్నీలు అదనపు పొటాషియంను సరిగ్గా ఫిల్టర్ చేయలేవు. ఇది వారి కిడ్నీలపై ఒత్తిడిని పెంచి కిడ్నీ రోగుల సమస్యను మరింత తీవ్రం చేస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు. అందుకే కిడ్నీ సమస్యలతో బాధపడేవారు తక్కువ పరిమాణంలో పప్పు ధాన్యాలు తినాలని లేదా వాటి జోలికి అస్సలు వెళ్లకపోవడమే మంచిదని సలహా ఇస్తున్నారు.
యూరిక్ యాసిడ్
యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నవారు పప్పుధాన్యాలు తినకూడదు. యూరిక్ యాసిడ్ కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్‌తో తయారవుతుంది. యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు కీళ్ల నొప్పులు పెరుగుతాయి. ఆ నొప్పిని భరించడం కూడా చాలా కష్టం. పప్పులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఈ ప్రోటీన్ శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిని చాలా పెంచుతుంది. దీనివల్ల కాళ్ళు, చేతుల్లో తీవ్రమైన నొప్పి, కీళ్లలో వాపు వస్తుంది. కాబట్టి, ఈ సమస్య ఉన్నవారు పప్పు కాయధాన్యాలు తినకూడదు.
గ్యాస్, ఉబ్బరం సమస్యలు
కడుపులో గ్యాస్ మరియు ఉబ్బరం వంటి సమస్యలు ఉన్నవారు కందిపప్పు తినకూడదు. సాధారణంగా పప్పులు జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. అందుకే అప్పటికే జీర్ణ సమస్యలు ఉన్నవారు పప్పు తినకూడదు. పొరపాటున తింటే కడుపు నొప్పి, పుల్లని త్రేన్పులు, గ్యాస్ వంటి సమస్యలు పెరుగుతాయి.
పైల్స్
పైల్స్ తో బాధపడేవారు పప్పు తినకూడదు. పప్పులో ప్రొటీన్ అధికంగా ఉండటం వల్ల త్వరగా జీర్ణం కాదు. దీనివల్ల మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి. అంతేకాకుండా, ఉదయం మలవిసర్జన చేయడంలో కూడా ఇబ్బంది ఉంటుంది. ఇది పైల్స్ రోగుల సమస్యను మరింత పెంచుతుంది. పైల్స్ తో బాధపడేవారు పప్పు తింటే వాపు, రక్తస్రావం వంటి సమస్యలు పెరుగుతాయి.
అలెర్జీ
అలెర్జీ సమస్యలు ఉన్నవారు పప్పు తినడం వల్ల మీ సమస్యలు పెరుగుతాయి. ముఖ్యంగా, రాత్రిపూట అస్సలు తినకూడదు. పప్పులో ఉండే ప్రోటీన్, ఐరన్, పొటాషియం వంటి పోషకాలు సులభంగా జీర్ణం కావు. అలెర్జీ సమస్యలు ఉన్నవారు దీనిని తినడం వల్ల చర్మపు దద్దుర్లు, వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడవచ్చు.
ఏదైనా ఆహారాన్ని పరిమిత పరిమాణంలో తీసుకోవాలి. ఎక్కువగా తినడం ఆరోగ్యానికి ప్రమాదకరం. ఈ నియమం పప్పు ధాన్యాలకు కూడా వర్తిస్తుంది. ఎక్కువ పప్పు ధాన్యాలు తినడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి, వాటిని పరిమిత పరిమాణంలో మాత్రమే తినండి. పప్పుతో ఏదైనా వంటకం తయారుచేసేటప్పుడు వాటిని నీటితో బాగా కడగాలి. పప్పును కడగకుండా ఉడికించవద్దు. పప్పును వండే ముందు వాటిని 20 నిమిషాలు నీటిలో నానబెట్టండి. నానబెట్టడం వల్ల పప్పు బాగా ఉడకుతుంది. త్వరగా జీర్ణమవుతుంది. బాగా నానబెట్టి ఉడికించని పప్పును తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయని పోషకాహార నిపుణులు అంటున్నారు.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
ఇవి కూడా చదవండి:
పైల్స్ ఉందా?ఈ ఆహారాలు పొరపాటున కూడా తినొద్దు!
బీపీ ఔషధాలు పని చేయట్లేదా.. కారణాలు ఇవే..
Updated Date - Aug 15 , 2025 | 07:37 PM