Constipation: పైల్స్ సమస్యా?ఈ ఆహారాలు పొరపాటున కూడా తినొద్దు!
ABN , Publish Date - Aug 15 , 2025 | 02:32 PM
పైల్స్ వ్యాధిగ్రస్తులు కొన్ని రకాల ఆహారాలను డైట్‌లో తప్పనిసరిగా నిషేధించాల్సిందే. ఆయుర్వేదం ప్రకారం, మూలవ్యాధి ఉన్న వ్యక్తి తన ఆహారంలో ఈ ఆహారాలను పొరపాటున కూడా చేర్చుకోకూడదు. తెలియకుండా చేసే ఈ పనివల్ల పైల్స్ నొప్పి మరింత ముదురుతుంది.
Constipation Causing Foods: మలబద్ధకం అనేది ఒక సాధారణ సమస్య. కానీ, చాలా మంది ప్రజలు సరైన ఆహారపు అలవాట్లు, నిశ్చల జీవనశైలి కారణంగా దీన్ని శాశ్వత సమస్యగా మార్చుకుంటున్నారు. పైల్స్ వల్ల ఇతర అనారోగ్య సమస్యలు మొదలవుతాయి. ఆహారంలో ఫైబర్ లేకపోవడం మలబద్ధకానికి ప్రధాన కారణం. ఉబ్బరం, గ్యాస్, ఎసిడిటీ లేదా పేగు రుగ్మతలు సహా అనేక కడుపు సంబంధిత సమస్యలు కూడా మలబద్ధకానికి కారణమవుతాయి. అయితే ఆహారపు అలవాట్లు దీనికి ప్రధాన కారణం.
పైల్స్‌ను సాధారణంగా హెమోరాయిడ్స్ అని పిలుస్తారు.ఈ సమస్యతో బాధపడుతున్న వ్యక్తి పాయువు లోపల, వెలుపల వాపు కారణంగా ఆ భాగం అంతా దెబ్బతింటుంది. దీని కారణంగా వ్యక్తి మలవిసర్జన చేస్తున్నప్పుడు తీవ్రమైన నొప్పి, రక్తస్రావం ప్రారంభమవుతుంది. ఆయుర్వేదం ప్రకారం, పైల్స్‌తో బాధపడుతున్న వ్యక్తి ఈ 5 రకాల ఆహారాలను తప్పనిసరిగా నివారించాలి.
స్పైసీ ఫుడ్
ఎక్కువ కారంగా ఉండే ఆహారం ఆరోగ్యానికి మంచిది కాదు. ముఖ్యంగా పైల్స్ పేషెంట్స్ పొరపాటున కూడా కారంగా ఉండే ఆహారాన్ని తినకూడదు. ఇలాంటి ఆహారం మూలవ్యాధిని ఇంకా తీవ్రం చేస్తుంది. ఉల్లిపాయ, అల్లం, మిరపకాయ, గరం మసాలా, సాస్, ఊరగాయ, చట్నీ వంటి కారంగా, పుల్లగా, కారంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల జీర్ణక్రియకు ఆటంకం ఏర్పడుతుంది. ముఖ్యంగా పుల్లని ఆహారాలు జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తాయి. మలద్వారంలో దురద, మంట, రక్తస్రావం వంటి సమస్యలను పెంచుతాయి.
వేయించిన ఆహారం
వేయించిన ఆహారం వల్ల కూడా మూలవ్యాధి సమస్య పెరుగుతుంది. మూలవ్యాధి ఉన్నవారు వేయించిన ఆహారాన్ని తినకూడదు. పొరపాటున తిన్నారంటే మాత్రం పైల్స్ సమస్య, నొప్పి రెండూ పెరుగుతాయి. వాస్తవానికి, దీర్ఘకాలిక మలబద్ధకం మూలవ్యాధికి కారణమవుతుంది. డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, ప్రాసెస్ చేసిన ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ అంత సులభంగా జీర్ణం కావు. ఈ రకమైన ఆహారం నోటికి రుచికరంగా ఉంటుంది కానీ పోషకాలు, ఫైబర్ ఉండదు. అధిక ఉప్పు, అనారోగ్యకరమైన కొవ్వులు జీర్ణవ్యవస్థను పాడు చేసి మలబద్దకానికి కారణమవుతాయి. ఇవి పైల్స్ వ్యాధిని తీవ్రం చేస్తాయి.
టీ, కాఫీలు
మూలవ్యాధి ఉన్నవారు టీ లేదా కాఫీని ఎక్కువగా తీసుకోకూడదు. అలా చేయడం వల్ల మూలవ్యాధి సమస్య ఇంకా పెరుగుతుంది.
అధిక చక్కెర
చక్కెర ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా పైల్స్ సమస్య పెరుగుతుంది. ఎందుకంటే చక్కెర తిన్న తర్వాత జీర్ణవ్యవస్థ పనితీరు మందగించడం వల్ల మలబద్ధకం సమస్య పెరుగుతుంది. ఇది మూలవ్యాధికి ప్రధాన కారణాలలో ఒకటి. దీనితో పాటు చక్కెర నిర్జలీకరణాన్ని కూడా పెంచుతుంది. మూలవ్యాధి సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
ఇవి కూడా చదవండి:
కూల్‌డ్రింక్స్ తాగే పిల్లలకు ఫ్యాటీ లివర్..!
బీపీ ఔషధాలు పని చేయట్లేదా.. కారణాలు ఇవే..