MLA Prasad: ఎమ్మెల్యే దగ్గుపాటి ఆసక్తికర కామెంట్స్.. నాకు ఆ రాజకీయం తెలియదు
ABN , Publish Date - Aug 15 , 2025 | 01:35 PM
‘‘రైతు కుటుంబం నుంచి వచ్చిన నాకు అభివృద్ధి తప్ప రాజకీయాలు చేయడం తెలియదు. సీఎం చంద్రబాబు ఆశీర్వాదం, మా యువనేత లోకేశ్ సహకారంతో ఎమ్మెల్యే అయ్యానని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు.
అనంతపురం: ‘‘రైతు కుటుంబం నుంచి వచ్చిన నాకు అభివృద్ధి తప్ప రాజకీయాలు చేయడం తెలియదు. సీఎం చంద్రబాబు ఆశీర్వాదం, మా యువనేత లోకేశ్ సహకారంతో ఎమ్మెల్యే అయ్యానని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్(MLA Daggupati Prasad) అన్నారు. ఆయన మాట్లాడుతూ.. నేను వచ్చినప్పటి నుంచి కుట్రలు చేస్తున్నారు. మళ్లీ నాకే ఎక్కడ టిక్కెట్ ఇస్తారోనన్న భయంతో పార్టీ లైన్‌లో ఉన్న మరో నాయకుడు బురద చల్లుతున్నారు.
ఎంతటి సీనియర్లు అయినా క్రమశిక్షణ తప్పితే చర్యలు ఖాయం. నేను తప్పుచేయను. చేస్తే తలవంచుతాను. పార్టీ నిర్ణయమే నాకు శిరోధార్యం. నగరంలో ఏడాది కాలంలో రూ.122 కోట్లతో అభివృద్ధి చేశాను. రూ.750 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం డీపీఆర్ పంపాము. 30 ఏళ్ల డంపింగ్ యార్డ్ సమస్యను క్లియర్ చేయిస్తున్నాము. మూడు వేల టిడ్కో ఇళ్లును లబ్ధిదారులకు అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నాము. సీపీఐ రామకృష్ణ నాకు బాగా తెలుసు. ఆయన ఎవరో రాసిచ్చిన స్ర్కిప్ట్ చదివినట్లున్నారు. ఎమ్మెల్యే అయ్యాక బంధువుల పేరిట, నా పేరిట సెంటు భూమి కొనలేదు.

గతంలో సుగుణ చికెన్ దుకాణాల్లో వసూళ్లు అంటూ యల్లనూరు, పుట్లూరు వ్యక్తుల పేరుతో వాయి్‌సలు బయటకొచ్చాయి. ఆ ప్రాంతంలో ఎవరికి బాగా పరిచయాలు ఉన్నాయో అందరికీ తెలుసు. అస్త్ర ఆసుపత్రి ఘటనపై రాంనగర్‌లో ఉండే శ్రీనివాస్ చౌదరి కొందరు మీడియా వాళ్లను జడ్పీలోకి తీసుకెళ్లి బలవంతంగా మా వాళ్ల పేర్లు చెప్పించే ప్రయత్నం చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. డబుల్ రిజిస్ట్రేషన్ వ్యవహారంపై సబ్ రిజిస్ట్రార్‌ను విచారించాలని జిల్లా రిజిస్ట్రార్‌ను కోరాము. భూ కబ్జాలు చేయాల్సిన అవసరం నాకు లేదు.
నా వద్దే వెయ్యిమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. నా బావమరిది అశోక్‌పై కూడా విమర్శలు చేస్తున్నారు. గతంలో రహంతుల్లా, మహాలక్ష్మి శ్రీనివాస్ ఎలా ఓడిపోయారో అందరికీ తెలుసు. ఇలాంటి రాజకీయాలు చేయడం నాకు తెలియదు. ఆ నాయకుడి అనుభవమంత వయస్సు కూడా నాకు లేదు. మంచి కోసం ఆయన సలహాలు ఇస్తే తీసుకుంటాను. 14 నెలలుగా నాపై కుట్రలు చేయడమే ఆయన పనిగా పెట్టుకున్నారు. ఇలాంటి వారు తగిన మూల్యం చెల్లించుకుంటారు..’’ అని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్థిరంగా బంగారం ధర.. ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
నిద్రిస్తున్న చిన్నారిని ఈడ్చుకెళ్లిన చిరుత!
Read Latest Telangana News and National News