Health: 62 ఏళ్ల వ్యక్తికి అరుదైన సర్జరీ..
ABN, Publish Date - Jul 25 , 2025 | 09:58 AM
సంక్లిష్టమైన బైలేటరల్ ప్రాక్సిమల్ హ్యూమరస్ ఫ్రాక్చర్ సర్జరీని 62 ఏళ్ల వ్యక్తికి బంజారాహిల్స్‌లోని రెనోవా సెంచరీ ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గురువారం ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలను ఆర్థోపెడిక్ సర్జన్ చీఫ్ ట్రామా సర్జన్ డాక్టర్ విజయ్‌కుమార్‌రెడ్డి, షోల్డర్ స్పోర్ట్స్ సర్జన్ డా.అనూ్‌పరెడ్డి సామ వివరించారు.
హైదరాబాద్ సిటీ: సంక్లిష్టమైన బైలేటరల్ ప్రాక్సిమల్ హ్యూమరస్ ఫ్రాక్చర్ సర్జరీని 62 ఏళ్ల వ్యక్తికి బంజారాహిల్స్(Banjara Hills)లోని రెనోవా సెంచరీ ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గురువారం ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలను ఆర్థోపెడిక్ సర్జన్ చీఫ్ ట్రామా సర్జన్ డాక్టర్ విజయ్‌కుమార్‌రెడ్డి, షోల్డర్ స్పోర్ట్స్ సర్జన్ డా.అనూప్ రెడ్డి సామ వివరించారు.
ఖమ్మం జిల్లా, ఖానాపురం హవేలి(Khanapuram Haveli), రోటరీ నగర్‌కు చెందిన 62 ఏళ్ల వ్యక్తి జారి పడిపోయిన ఘటనలో రెండు భుజాలకు గాయమై చేతులను కదపలేని స్థితికి చేరుకున్నాడు. అతన్ని రెనోవా సెంచరీ ఆస్పత్రికి తీసుకురాగా, పరిశీలించిన ఆర్థోపెడిక్ ఆంకోసర్జన్ విభాగం అధిపతి డాక్టర్ హిమకాంత్ లింగాలతో పాటు తాము, తమ సహచర వైద్య బృందం చికిత్సను ప్రారంభించామన్నారు.
కుడి భుజానికి రైట్ రివర్స్ షోల్డర్ ఆర్థోప్ర్లాస్టీ (ఈ ప్రక్రియలో, ఎముక నిర్మాణాన్ని మార్చడం ద్వారా భుజం బంతి, కఫ్ స్థానాన్ని తిరగవేసి, భుజం కదలికను మెరుగుపరచడం), ఆ తరువాత ఫిలోస్ ప్లేట్ ఫిక్సేషన్ ఉపయోగించి ఎడమ భుజానికి ఓపెన్ రిడక్షన్ అండ్ ఇంటర్నల్ ఫిక్సేషన్ సర్జరీని పూర్తి చేసినట్లు వివరించారు. రోగి త్వరగానే కోలుకుని వారం రోజుల్లోనే డిశ్చార్జ్ అయ్యారన్నారు. ఈ సమావేశంలో వైద్యులు సుహాస్ మసిలామణి, విష్ణు, రవీంద్రనాథ్ గరగ పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పెరిగిన ధరలకు బ్రేక్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
అప్పులు తీర్చలేక ఇద్దరు రైతుల ఆత్మహత్య
Read Latest Telangana News and National News
Updated Date - Jul 25 , 2025 | 09:58 AM