Farmers Suicide: అప్పులు తీర్చలేక ఇద్దరు రైతుల ఆత్మహత్య
ABN , Publish Date - Jul 25 , 2025 | 05:39 AM
ఎన్నో ఆశల తో అప్పులు తెచ్చి సాగు చేసిన పంటలు సరైన దిగుబడులు రాక దిక్కుతోచని స్థితిలో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నా రు.
భువనగిరి, భూపాలపల్లి జిల్లాల్లో ఘటనలు
వలిగొండ, కాటారం, జూలై 24 (ఆంధ్రజ్యోతి): ఎన్నో ఆశల తో అప్పులు తెచ్చి సాగు చేసిన పంటలు సరైన దిగుబడులు రాక దిక్కుతోచని స్థితిలో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం కంచనపల్లికి చెందిన వడ్డెబోయిన మీన య్య (60) పత్తి సాగు చేయగా సరైన దిగుబడి రాకపోవడం, అప్పులు తీర్చే మార్గం లేక గురువారం పొలంలో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
అలాగే, భూపాలపల్లి జిల్లా కాటారం మండలం చింతకానికి చెందిన గోల్కొండ పోచం(64) పత్తి, మిర్చి సాగు చేయగా సరైన దిగుబడులు రాలేదు. దీంతో అప్పు ఎలా తీర్చాలన్న బెంగతో బుధవారం పురుగు మందు తాగాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం చనిపోయాడు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణలో చేపట్టిన సర్వే దేశానికి ఆదర్శం కావాలి: ఖర్గే
మాజీ మంత్రి మల్లారెడ్డికి బిగ్ షాక్.. ఐటీ అధికారుల సోదాలు
Read latest Telangana News And Telugu News