ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Foods For Strong Teeth: బ్రష్‌ చేస్తే సరిపోదు.. ఆరోగ్యకరమైన దంతాల కోసం ఇవీ తినాలి..

ABN, Publish Date - Jul 11 , 2025 | 01:50 PM

దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం ఖరీదైన టూత్ పేస్టుతో బ్రషింగ్, పదే పదే మౌత్ వాష్‌ వాడితే సరిపోదు. నోటి ఆరోగ్యం కోసం ఈ ఆహారాలను క్రమం తప్పకుండా తిన్నప్పుడే తెల్లని మెరిసే దంతాలు మీ సొంతమవుతాయి.

Healthy foods for teeth

Germ Free Teeth Diet: మన ఆహారపు అలవాట్లు, శారీరక ఆరోగ్యంపైనే నోటి ఆరోగ్యం కూడా ఆధారపడి ఉంటుంది. మీరు క్రమం తప్పకుండా రోజుకు రెండుసార్లు బ్రష్ చేస్తున్నా.. ఖరీదైన టూత్ పేస్టులు, మౌత్ వాష్ వంటివి వినియోగిస్తున్నా దంత ఆరోగ్యం మెరుగుపడలేదంటే.. ఇదే కారణం కావచ్చు. ఎందుకంటే, నోటి దుర్వాసన, దంత క్షయం వంటి సమస్యల నియంత్రణకు కేవలం పైపై సంరక్షణా చర్యలు మాత్రమే తీసుకుంటే చాలదు. ఈ కింది ఆహారాలను డైట్‌లో భాగం చేసుకోవాలి. అప్పుడే దంత సమస్యలు పూర్తిగా నయమవుతాయి.

మీరు రోజూ ఏం తింటారు అనే దానిపైనే దంత ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. క్యాండీలు, కూల్ డ్రింక్స్, జంక్ ఫుడ్స్ వంటి ఆహారాలు దంత క్షయానికి కారణమవుతాయి. నోటి ఆరోగ్యానికి పోషకాహారం చాలా ముఖ్యం. ఇవి మీ చిగుళ్లు, దంతాలపై తక్షణ ప్రభావాన్ని చూపుతాయి. అదే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తే దంత క్షయం, క్యావిటీస్, చిగుళ్ల వ్యాధులు వచ్చే అవకాశాలు అధికం. ముఖ్యంగా మధుమేహం, గుండె జబ్బులు వంటి సమస్యలు ఉన్న వారిలో నోటి ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతినే ఛాన్స్ ఉంది. అందుకే ఈ కింది ఆరోగ్యకరమైన ఆహారాలతో నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోండి.

1. చీజ్

జున్ను రుచికరమైన పౌష్ఠికాహారం. ఇది తక్షణ ప్రయోజనాలనూ అందిస్తుంది. దీన్ని తినడం వల్ల నోటిలోని pH పెరుగుతుంది. అలాగే దంత క్షయం ప్రమాదం తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. జున్ను తిన్నప్పుడు నోటిలో లాలాజలం ఊరుతుంది. తద్వారా పళ్లపై ఉండే క్రిములు వదిలిపోతాయి. ఇంకా వీటిలోని కాల్షియం, ప్రోటీన్ దంతాలను దృఢంగా చేస్తాయి.

2. ఆకుకూరలు

ఆరోగ్యకరమైన ఆహారపదార్థాల్లో ఆకుకూరలది ఎప్పుడూ ముందువరసే. ఇవి తేలికగా జీర్ణమై తక్షణ శక్తిని ప్రసాదిస్తాయి. విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. కేలరీలు తక్కువగా ఉంటాయి. కాలీ ఫ్లవర్, పాలకూర వంటివి నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వీటిలో కాల్షియం అధికంగా ఉండటం వల్ల దంతాలపై ఎనామిల్‌ను బలోపేతం చేస్తాయి.

3. ఆపిల్

వైద్యులు సాధారణంగా తియ్యని రుచి గల ఆహారాలకు దూరంగా ఉండాలని సిఫార్సు చేస్తుంటారు. కానీ, ఆపిల్ పండ్లు మాత్రం అందుకు మినహాయింపు. ఈ పండ్లలో అధిక నీరు, ఫైబర్ కంటెంట్ఉంటాయి. అందుకే ఆపిల్ తినడం వల్ల నోటిలో లాలాజలం ఉత్పత్తి అవుతుంది. ఇది నోట్లో ఉన్న పేరుకుపోయిన బ్యాక్టీరియా, ఆహార పదార్థాలను తొలగిస్తుంది. ఆపిల్ పండులోని పీచు చిగుళ్ల ఆరోగ్యాన్నీ ప్రోత్సహిస్తుంది.

4. పెరుగు

జున్ను మాదిరిగానే పెరుగులో కాల్షియం, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మీ దంతాలను దృఢంగా ఉంచే బలమైన ఆహారాల్లో ఒకటి. పెరుగులో లభించే ప్రోబయోటిక్స్ లేదా ప్రయోజనకరమైన బ్యాక్టీరియా చిగుళ్ళకు మేలు చేస్తాయి. ఈ పదార్థాల్లోని మంచి బ్యాక్టీరియా క్యావిటీలను ప్రేరేపించే బ్యాక్టీరియాను తొలగిస్తుంది. ఆహారంలో ఎక్కువ పెరుగు తినాలని ఇష్టపడేవారు చక్కెర కలపడకుండా తింటే మంచిది.

5. క్యారెట్లు

ఆపిల్ లాగానే క్యారెట్లలోనూ ఫైబర్ అధికం. విటమిన్ ఎ కు అద్భుత మూలం. ప్రతి భోజనం తర్వాత కొన్ని పచ్చి క్యారెట్లు తినడం వల్ల మీ నోటిలో లాలాజలం ఉత్పత్తి పెరుగుతుంది. ఈ అలవాటు నోటి సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. క్యారెట్లు సలాడ్ పైన కొన్ని పచ్చి క్యారెట్ ముక్కలను తింటూ ఉంటే దంతాలకు చాలామంచిది.

6. బాదం

బాదం కాల్షియం, ప్రోటీన్స్‌కు మంచి మూలం. చక్కెర కూడా తక్కువగా ఉంటుంది. ప్రతిరోజూ ఒక గుప్పెడు బాదం పప్పులను తింటే ఆరోగ్యానికి అద్భుత ఔషధంలా పనిచేస్తుంది. నచ్చితే సలాడ్ లేదా స్టైర్-ఫ్రై డిన్నర్‌లో కూడా ఒక గుప్పెడు బాదం పప్పును కలుపుకుని ఆరగించవచ్చు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)

Also Read:

మధుమేహం ఉన్నవారికి బిగ్ రిలీఫ్.. MIT కొత్త ఇంప్లాంట్ అభివృద్ధి.!

వర్షాకాలంలో వంకాయలు.. ఆరోగ్యానికి మంచివేనా?

For More Health News

Updated Date - Jul 11 , 2025 | 06:37 PM