ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Every Morning Eating Banana: ప్రతి రోజూ ఉదయం అరటిపండు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ABN, Publish Date - Aug 17 , 2025 | 08:07 AM

కొంత మందికి ప్రతి రోజు ఉదయం అరటిపండు తినడం అలవాటుగా ఉంటుంది. ఇది సులభమైన, రుచికరమైన ఆప్షన్. కానీ, రోజూ ఉదయం అరటిపండు తినడం వల్ల మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? రండి, ఈ పసుపు రంగు సూపర్‌ ఫుడ్ గురించి తెలుసుకుందాం.

Every Morning Eating Banana

ప్రతిరోజు ఉదయం అరటిపండు తినడం కొందరికి ఒక అలవాటుగా ఉంటుంది. అయితే అరటిపండు నిజంగా ఆరోగ్యానికి మంచిదేనా? లేక రోజువారీ భోజనానికి బదులుగా తీసుకోవడం వల్ల దుష్పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందా? (Every Morning Eating Banana) ఈ చిన్నపాటి అలవాటు మన ఆరోగ్యంపై ఎలా ప్రభావం చూపుతుందనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

అలసటకి గుడ్ బై

అరటిపండులో సహజమైన కార్బోహైడ్రేట్స్‌ తో పాటు బి-విటమిన్స్ (B6, B1) ఉంటాయి. ఇవి శక్తిని సమతుల్యంగా ఉంచుతాయి. పైగా ఇందులో ఉండే ఫైబర్ వల్ల చక్కెర తక్షణంగా శరీరంలోకి జీర్ణం కాకుండా నెమ్మదిగా విడుదలవుతుంది. దీంతో ఉదయం మొత్తం ఉత్సాహంగా అనిపిస్తుంది.

జీర్ణవ్యవస్థకు మిత్రుడు

ఒక అరటిపండు దాదాపు 3-5 గ్రాముల ఫైబర్ ఇస్తుంది. ఇది మీ తిండిని సరిగ్గా జీర్ణం అయ్యేలా చేస్తుంది. కొద్దిగా పచ్చి అరటిపండ్లు తింటే అందులో ఉన్న రెసిస్టెంట్‌ స్టార్చ్ మీ చక్కటి జీర్ణ వ్యవస్థకు సహాయపడుతుంది. ఇది మీ శరీరంలో గుడ్ బ్యాక్టీరియాను పెంచి మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలకు నయం చేస్తుంది. BRAT డైట్‌లో (Banana, Rice, Applesauce, Toast) అరటిపండు ఉండటం దీని ఔషధగుణాన్ని సూచిస్తుంది.

రక్తపోటు నియంత్రణ

ఒక్క అరటిపండులో దాదాపు 400 మిల్లీగ్రాముల పొటాషియం ఉంటుంది. ఇది శరీరంలో సోడియంను తక్కువ చేయడంలో సహాయపడుతుంది. రక్తనాళాలు రిలాక్స్ అవ్వడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అలాగే పొటాషియం వల్ల కండరాలు కూడా బాగా పనిచేస్తాయి. ఇది మీ గుండె ఆరోగ్యానికి కూడా ఒక మంచి గిఫ్ట్ లాంటిది!

మూడ్‌ బాగుంటుందా..

అరటిపండులో ఉన్న B6 విటమిన్‌, ట్రిప్టోఫాన్ అనే అమినో యాసిడ్ మన శరీరంలో సెరోటోనిన్, డోపమిన్ అనే హ్యాపీ హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి. దీనివల్ల మనసు హాయిగా ఉంటుంది. ఒత్తిడి తక్కువగా అనిపిస్తుంది. అందుకే అరటిపండును నేచురల్ మూడ్ బూస్టర్ అని కూడా పిలుస్తుంటారు.

మిమ్మల్ని రక్షించేవి

విటమిన్ సీ, మాంగనీస్, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు అరటిపండులో ఉన్నాయి. ఇవి శరీరాన్ని నిత్యం ఎదురయ్యే ఒత్తిడిని (Oxidative Stress) తట్టుకునేలా చేస్తాయి. ఇక కార్బోహైడ్రేట్స్ వల్ల శరీరానికి తక్షణ శక్తి కూడా లభిస్తుంది. అరటిపండును పీనట్ బటర్, గింజలతో తింటే ఫైబర్‌తో పాటు ప్రోటీన్‌ కూడా అందుతుంది. దీన్ని ఉదయాన్నే తీసుకుంటే రోజంతా ఆకలిలేని ఫీలింగ్‎ను ఇస్తుంది.

వ్యాయామం చేసే వారికి

అరటిపండులో పొటాషియం,మెగ్నీషియం ఉండటంతో ఇది ఒక మంచి ఎలక్ట్రోలైట్ స్నాక్. జిమ్‌కి ముందు లేదా తర్వాత తింటే ఇది శరీరానికి శక్తినిస్తుంది, కండరాల్లో క్రాంప్స్‌ రాకుండా చూస్తుంది. కొన్ని పరిశోధనల ప్రకారం, అరటిపండు స్పోర్ట్స్ డ్రింక్ కంటే బెట్టర్ అని చెబుతున్నారు.

వీటి విషయంలో జాగ్రత్త

షుగర్ కంట్రోల్ చూసుకోవాలి: అరటిపండులో సహజ చక్కెర ఎక్కువగా ఉంటుంది (దాదాపు 27 గ్రాములు). డయాబెటిస్ ఉన్నవారు అరటిపండును తినే విషయంలో జాగ్రత్త వహించాలి.

పొటాషియం ఎక్కువ కావొచ్చు: కిడ్నీ సంబంధిత సమస్యలున్నవారు లేదా పొటాషియం పెరగకుండా జాగ్రత్త తీసుకోవాల్సినవారు అరటిపండు తినాలంటే డాక్టర్‌ను సలహాలు తీసుకోవాలి.

మైగ్రేన్ లేదా IBS ఉన్నవారికి జాగ్రత్త: పండిన అరటిపండ్లలో టైరమెన్ అనే పదార్థం ఉంటుంది. ఇది కొందరికి మైగ్రేన్‌ను ప్రేరేపించొచ్చు. అలాగే IBS ఉన్నవారికి ఇది డైజెస్టివ్ ఇబ్బందులు కలిగించొచ్చు.

  • ప్రతి రోజు ఉదయం ఒక అరటిపండు తినడం ఆరోగ్యవంతమైన అలవాటు. ఒక పండు కంటే ఎక్కువ తినడం మంచిది కాదు. మీ ఆరోగ్య పరిస్థితులను బట్టి రోజు తినాలా వద్దా అనేది కూడా నిర్ణయించుకోవాలి.

గమనిక: ఆంధ్రజ్యోతి ఈ విషయం గురించి ఆరోగ్య సమాచారం మాత్రమే అందిస్తుంది. దీని విషయంలో మీకు ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే డాక్టర్‌ని సంప్రదించండి.

ఇవి కూడా చదవండి

డెంగ్యూ దాడికి చెక్ పెట్టండి.. ఈ చిట్కాలతో ఆరోగ్యంగా ఉండండి

మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 17 , 2025 | 12:57 PM