ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Jubilee Hills By Election: గట్టిగా సమాధానం ఇచ్చిన జూబ్లీహిల్స్ ప్రజలు: నవీన్ యాదవ్

ABN, Publish Date - Nov 14 , 2025 | 03:27 PM

భారీ మెజార్టీతో తనను జూబ్లీహిల్స్ ప్రజలు గెలిపించారని నవీన్ యాదవ్ పేర్కొన్నారు. తనను ఎమ్మెల్యేగా గెలుపించినందుకు ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు పాదాభివందనం చేస్తున్నట్లు ప్రకటించారు.

హైదరాబాద్, నవంబర్ 14: నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తల నమ్మకాన్ని వమ్ము చేయనని జూబ్లీహిల్స్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్‌ యాదవ్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన అనంతరం నవీన్ యాదవ్ శుక్రవారం యూసుఫ్‌గూడలో విలేకర్లతో మాట్లాడుతూ.. అధిక బడ్జెట్ తీసుకువచ్చి.. జూబ్లీహిల్స్‌ను మరింత అభివృద్ధి చేస్తానని నియోజకవర్గ ప్రజలకు ఆయన హామీ ఇచ్చారు. భారీ మెజార్టీతో తనను జూబ్లీహిల్స్ ప్రజలు గెలిపించారన్నారు. తనను ఎమ్మెల్యేగా గెలుపించినందుకు ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు పాదాభివందనం చేస్తున్నట్లు చెప్పారు.

ఎంతో కష్టపడి జూబ్లీహిల్స్ కార్యకర్తలు తనను గెలిపించుకున్నారని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధే తన ఎజెండా అని పేర్కొన్నారు. అయితే గతంలో బీఆర్ఎస్ పార్టీ గెలిచిన సమయంలో కక్షపూరిత రాజకీయాలు చేశారని గుర్తు చేశారు. కానీ తాను అలాంటి రాజకీయాలు చెయ్యనన్నారు. అందరినీ కలుపుకుని వెళ్లి.. మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని ప్రకటించారు. మన ప్రాంత సమస్యలు రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్తానని తెలిపారు.

తనను, తన కుటుంబం వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తూ ఓట్లు అడిగారని.. అందుకు జూబ్లీహిల్స్ ప్రజలు గట్టిగా సమాధానం ఇచ్చారన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయంపై బీఆర్ఎస్ చేసిన ఆరోపణలను ఈ సందర్భంగా ఆయన ఖండించారు. రిగ్గింగ్, దౌర్జన్యం అనేవి తప్పుడు మాటలని నవీన్ యాదవ్ వ్యాఖ్యానించారు.

మరోవైపు.. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించడంపై బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత మండిపడ్డారు. అధికార కాంగ్రెస్ దౌర్జన్యాలు, రిగ్గింగ్ వల్లే ఆ పార్టీ అభ్యర్థికి ఈ విజయం సొంతమైందంటూ విమర్శించారు. ఈ నేపథ్యంలో నవీన్ యాదవ్ పై విధంగా స్పందించారు.

ఈ వార్తలు కూడా చదవండి..

రిగ్గింగ్ చేసి గెలిచిన కాంగ్రెస్: మాగంటి సునీత

ఇదే సరైన సమయం.. రండి పెట్టుబడులు పెట్టండి: ఉపరాష్ట్రపతి

Read Latest TG News And Telugu News

Updated Date - Nov 14 , 2025 | 05:22 PM