KTR Jubilee Hills Election: మాజీ మంత్రి కేటీఆర్‌కు షాక్
ABN, Publish Date - Nov 05 , 2025 | 10:13 AM
మాజీ మంత్రి కేటీఆర్‌కు షాక్ తగిలింది. జూబ్లీహిల్స్‌లో ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తూ కేటీఆర్ ప్రచారాలు నిర్వహిస్తున్నారని ఓ ఓటరు ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి కేటీఆర్‌పై ఓటరు షఫీవుద్దీన్ ఫిర్యాదు చేశారు. ఎన్నికల ప్రచారంలో మైనర్లను ఉపయోగించారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు రిటర్నింగ్ అధికారికి ఆయన లిఖితపూర్వకంగా ఫిర్యాదు సమర్పించారు.
రాజకీయ లాభం కోసం, ప్రజల్లో సానుభూతి రేకెత్తించాలనే ఉద్దేశ్యంతో కేటీఆర్ మైనర్లతో ప్రచారం చేయిస్తున్నారని కంప్లైంట్ చేశారు. ఇది ఎన్నికల నియమాన్ని ఉల్లంఘించడం అవుతుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే కేటీఆర్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని, ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రచారాలు నిర్వహిస్తున్నందుకు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో ఈ ఫిర్యాదు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల అధికారులు ఈ ఫిర్యాదుపై స్పందించాల్సి ఉంది.
Also Read:
మంత్రి నారాయణ దుబాయ్ పర్యటన.. ప్రముఖ సంస్థల ఛైర్మన్లతో
రోడ్డుపై డబ్బు దొరికితే మంచిదేనా..? జ్యోతిష్యం ఏం చెబుతోంది..
For More Latest News
Updated Date - Nov 05 , 2025 | 10:19 AM