Narayana Dubai Visit: మంత్రి నారాయణ దుబాయ్ పర్యటన.. ప్రముఖ సంస్థల ఛైర్మన్లతో
ABN , Publish Date - Nov 05 , 2025 | 10:12 AM
బీఆ (BEEAH) ఫెసిలిటీ, టెక్టాన్ (tecton) ఇంజనీరింగ్, అరబ్ - ఇండియా స్పీసెస్ కంపెనీల ప్రతినిధులతో మంత్రి నారాయణ సమావేశంకానున్నారు. వేస్ట్ మేనేజ్మెంట్, రికవరీ ప్లాంట్‌లు, వైద్య రంగంలో బీఆ (BEEAH)ఫెసిలిటీ సంస్థ ప్రపంచ ప్రసిద్ధి పొందింది.
దుబాయ్, నవంబర్ 5: ఏపీకి పెద్దఎత్తున పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యంగా ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు విదేశాల్లో పర్యటిస్తున్నారు. ప్రముఖ సంస్థల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలను కలుస్తూ పెట్టుబడులకు ఏపీ అనువైన ప్రాంతమని చెబుతున్నారు. కొద్దిరోజుల క్రితం సీఎం చంద్రబాబు దుబాయ్‌లో, మంత్రి లోకేష్ ఆస్ట్రేలియాలో పర్యటించి ఇన్వెస్ట్‌మెంట్స్‌పై ఫోకస్ పెట్టారు. ఇప్పుడు తాజాగా మంత్రి నారాయణ బృందం దుబాయ్‌లో పర్యటిస్తోంది. రాష్ట్రానికి పెట్టుబడుల సాధన కోసం మూడు రోజులుగా దుబాయ్‌లో మంత్రి నారాయణ బృందం పర్యటన కొనసాగుతోంది.
ఈరోజు (బుధవారం) బీఆ (BEEAH) ఫెసిలిటీ, టెక్టాన్ (tecton) ఇంజనీరింగ్, అరబ్ - ఇండియా స్పీసెస్ కంపెనీల ప్రతినిధులతో మంత్రి సమావేశంకానున్నారు. వేస్ట్ మేనేజ్మెంట్, రికవరీ ప్లాంట్‌లు, వైద్య రంగంలో బీఆ (BEEAH)ఫెసిలిటీ సంస్థ ప్రపంచ ప్రసిద్ధి పొందింది. విద్యుత్, ఆయిల్, గ్యాస్, వాటర్ ప్రాజెక్ట్స్ నిర్మాణంలో టెక్టాన్ ఇంజినీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీ పేరుగాంచింది. ప్రపంచంలో ఆహార ధాన్యాల ఎగుమతిలో అరబ్ - ఇండియా స్పీసెస్ సంస్థ రెండో స్థానంలో ఉంది. ఈ క్రమంలో ఆయా సంస్థల ఛైర్మన్‌లతో మంత్రి నారాయణ సమావేశమై ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించనున్నారు. అనంతరం విదేశీ పర్యటనను ముగించుకుని ఈ రాత్రికి మంత్రి నారాయణ దుబాయ్ నుంచి బయలుదేరి హైదరాబాద్‌కు చేరుకోనున్నారు.
ఇవి కూడా చదవండి...
శివనామస్మరణతో మారుమోగుతున్న ఆలయాలు..
అమెరికాలో ఘోర ప్రమాదం.. పేలిన కార్గో విమానం
Read Latest AP News And Telugu News