America Cargo Plane Crash: అమెరికాలో ఘోర ప్రమాదం.. పేలిన కార్గో విమానం
ABN , Publish Date - Nov 05 , 2025 | 08:35 AM
అమెరికా కెంటకీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. టేకాఫ్ తీసుకున్న కార్గో విమానం కాసేపటికే పేలడంతో ముగ్గురు మృతి చెందారు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా కెంటకీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. టేకాఫ్ తీసుకున్న కార్గో విమానం హవాయి వెళ్తుండగా కాసేపటికే పేలడంతో ముగ్గురు మృతి చెందారు. అంతేకాకుండా 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కార్గో విమానంలో దాదాపు 280,000 పౌండ్ల (సుమారు 42,000 గ్యాలన్లు) ఇంధనం ఉండటంతో పేలుడు తీవ్రత పెరిగిందని అధికారులు భావిస్తున్నారు.
మహ్మద్ అలీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బాధితులను హుటాహుటినా ఆసుపత్రికి తరలించారు. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.