ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Bihar Elections Exit polls: మరి కొద్ది గంటల్లో ఎగ్జిట్ పోల్ ఫలితాలు

ABN, Publish Date - Nov 11 , 2025 | 02:49 PM

తొలి విడత పోలింగ్ ఈనెల 6న జరుగగా, భారీ ఎత్తున పోలింగ్ నమోదైంది. రికార్డు స్థాయిలో 65.08 శాతం పోలింగ్ నమోదు కావడంతో రెండో విడత కూడా ఆదే రకంగా ఉంటే ప్రజలు మార్పును కోరుకునే అవకాశాలు ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి.

పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly Elections) తుది విడత పోలింగ్ మంగళవారం కొనసాగుతోంది. 123 నియోజకవర్గాల్లో జరుగుతున్న పోలింగ్ సాయంత్రం 6 గంటలతో ముగియనుంది. సరిగ్గా 6.30 గంటలకు వివిధ సంస్థలు నిర్వహించిన సర్వే ఫలితాలు వెలువడతాయి. ఓటర్ల సెంటిమెంట్, ఫలితాలు ఏవిధంగా ఉండే అవకాశాలున్నాయనే దానిపై ఆయా సంస్థల ఎగ్జిట్ పోల్ ఫలితాలు కీలక పాత్ర వహిస్తుంటాయి. కొన్ని సర్వేలు అంతిమ ఫలితాలకు దగ్గరగా ఉండే అవకాశాలుంటాయి. ఆ కారణంగా ఎగ్జిట్ పోల్ ఫలితాలపై సర్వేసర్వత్రా ఆసక్తి కనిపిస్తుంటుంది.

రెండో విడత

తొలి విడత పోలింగ్ ఈనెల 6న జరుగగా, భారీ ఎత్తున పోలింగ్ నమోదైంది. రికార్డు స్థాయిలో 65.08 శాతం పోలింగ్ నమోదు కావడంతో రెండో విడత కూడా ఆదే రకంగా ఉంటే ప్రజలు మార్పును కోరుకునే అవకాశాలు ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి. రెండో విడత పోలింగ్‌లో 3.70 కోట్ల మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. నేపాల్‌తో సరిహద్దులు పంచుకుంటున్న చంపరాన్, ఈస్ట్ చంపరాన్, సీతామర్హి, మధుబని, సుపౌల్, అరారియా, కిషన్ గంజ్ జిల్లాలు ‌రెండో విడత పోలింగ్‌ జరుగుతున్న నియోజకవర్గాల్లో ఉన్నాయి. అధికార ఎన్డీయే, విపక్ష ఇండియా కూటమి మధ్యే పోటీ ప్రధానంగా ఉండే అవకాశాలుండగా, తొలిసారి ఎన్నికల్లో దిగుతున్న ప్రశాంత్ కిషోర్ జన్‌సురాజ్ ప్రభావం ఓటర్లపై ఏవిధంగా ఉందనేది ఈసారి ఆసక్తి కలిగిస్తోంది.

కౌంటింగ్

243 నియోజకవర్గాల్లో ఎన్నికల కౌంటింగ్ నవంబర్ 14న జరుగునుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలవుతుంది. కౌంటింగ్ పూర్తయ్యేంత వరకూ సీటు వారీ ఫలితాలను ఎన్నికల కమిషన్ ప్రకటిస్తుంది.

ఇవి కూడా చదవండి..

బిహార్లో నేడే తుది పోరు

ఢిల్లీ పేలుళ్ల ఘటన.. కీలక వ్యక్తి ఫొటో వెలుగులోకి..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 11 , 2025 | 04:03 PM