ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

PM Modi: మాది వికాసం, వారిది వినాశనం.. ప్రధాని మోదీ

ABN, Publish Date - Nov 03 , 2025 | 04:34 PM

బిహార్‌లోని సహర్సాలో సోమవారం జరిగిన ఎన్నికల ప్రచారసభలో ప్రధాని మాట్లాడుతూ, ప్రజలకు అందే ఎలాంటి సాయమైనా 'జంగిల్ రాజ్' నేతలు నిలిపేస్తారని, వారికి అభివృద్ధి పట్ల ఎలాంటి ఆలోచన ఉండదని చెప్పారు.

PM Modi in Bihar

సహర్సా: 'జంగిల్ రాజ్' శక్తులైన ఆర్జేడీ, కాంగ్రెస్ పట్ల మహిళలు, యువత అప్రమత్తంగా ఉండాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. బలమైన ఎన్డీయే ప్రభుత్వం ప్రగతి, సాధికారతకు భరోసా ఇస్తుందని చెప్పారు. ఎన్డీయే అంటే వికాసమని, ఆర్జేడీ-కాంగ్రెస్ అంటే వినాశమని వ్యాఖ్యానించారు. తొలిసారి ఓటు వేసే వారు ఎన్డీయేను గెలిపించేలా తమ ఓటును వినియోగించుకోవాలని కోరారు.

బిహార్‌లోని సహర్సాలో సోమవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మాట్లాడుతూ, ప్రజలకు అందే ఎలాంటి సాయమైనా 'జంగిల్ రాజ్' నేతలు నిలిపేస్తారని, వారికి అభివృద్ధి పట్ల ఎలాంటి ఆలోచన ఉండదని చెప్పారు. నవంబర్ 6న సహర్సా, మధేపురాలో ఓటింగ్ జరుగనుందని, చాలామంది యువకులు, ఆడకూతుళ్లు తొలిసారి ఓటు వేస్తున్నారని అన్నారు. తాను మొదటిసారి ఓటు వేసినప్పుడు ఎలా ఆలోచించాననే విషయాన్ని మోదీ గుర్తు చేసుకున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగే వారికే ఓటు వేయాలని తాను అనుకున్నానని, ఆ విషయంలో తాను సక్సెస్ అయ్యానని చెప్పారు. కొత్తగా ఓటు వేసే వారు కూడా రాష్ట్రంలో మరోసారి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడేలా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

బిహార్‌కు కీలక మౌలిక సదుపాయల ప్రాజెక్టులను ఆపేసిన రికార్డు అప్పటి ఆర్జేడీ-కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందని మోదీ చెప్పారు. 2003లో కోసి రైల్ మహాసేతు ప్రాజెక్టుకు అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి శంకుస్థాపన చేశారని, కానీ 2004లో ఆర్జేడీ మద్దతుతో కేంద్రంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం వచ్చిందని అన్నారు. అయితే 2005లో బిహార్‌లో నితీష్ కుమార్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటైందని, ప్రజలు ఆర్జేడీని ప్రతి వీధి నుంచి తరిమికొట్టారని చెప్పారు.

ఇవి కూడా చదవండి..

అడగడానికి ఇంకేమీ ప్రశ్నలు లేవా... నాయకత్వ మార్పుపై సిద్ధరామయ్య

ఉద్యోగమిప్పించమని వచ్చి.. ఎమ్మెల్యేని కుళ్లబొడిచేశాడు

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 03 , 2025 | 04:51 PM