ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Bihar Elections: కోడ్ ఉల్లంఘనలపై 650 ఫిర్యాదులు.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్

ABN, Publish Date - Oct 21 , 2025 | 09:48 PM

అక్టోబర్ 6న ఎన్నికల ప్రకటన విడుదల చేసినప్పటి నుంచి అక్టోబర్ 21వ తేదీ వరకూ రూ.71.32 కోట్లు విలువచేసే నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, కీలకమైన మెటల్స్, ఇతర ఉచితాలను ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు స్వాధీనం చేసుకున్నట్టు ఈసీ తెలిపింది.

EC on Bihar Elections

న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికలు, ఏడు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని (Model Code of Conduct) ఉల్లంఘించినట్టు 650 ఫిర్యాదులు అందాయని ఎన్నికల కమిషన్ (EC) మంగళవారంనాడు తెలిపింది. సి-విజిల్ యాప్ (C-Vigil App) ద్వారా అక్టోబర్ 6 నుంచి 21వ తేదీ వరకూ ఈ ఫిర్యాదులు అందినట్టు చెప్పింది. వీటిలో 649 ఫిర్యాదులను పరిష్కరించామని, 94 శాతం ఫిర్యాదులను (612) కేవలం 100 నిమిషాల్లోనే పరిష్కరించామని ఒక ప్రకటనలో తెలిపింది.

అక్టోబర్ 6న ఎన్నికల ప్రకటన విడుదల చేసినప్పటి నుంచి అక్టోబర్ 21వ తేదీ వరకూ రూ.71.32 కోట్లు విలువచేసే నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, కీలకమైన మెటల్స్, ఇతర ఉచితాలను ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు స్వాధీనం చేసుకున్నట్టు ఈసీ తెలిపింది.

కాగా, బిహార్‌ ఎన్నికల్లో ఫిర్యాదులు వచ్చిన 100 నిమిషాల్లోగా వాటిపై చర్యలు తీసుకునేందుకు 824 ఫ్లయింగ్ స్క్వాడ్‌లను ఈసీ మోహరించింది. 24 గంటల ఫిర్యాదుల విభాగాన్ని కూడా ఏర్పాటు చేసింది. అదే విధంగా పార్టీలు, అభ్యర్థులు, సంస్థలు ఎన్నికల రోజున కానీ, ఒక రోజు ముందు కానీ ప్రింట్ మిడియాలో ఎలాంటి ప్రకటనలను ఇవ్వరాదని కూడా ఆదేశాలిచ్చింది.

ఇవి కూడా చదవండి..

సీఎం నియోజకవర్గం నుంచి రసవత్తర పోటీ

12 సీట్లలో విపక్ష కూటమి మిత్రపక్షాల మధ్య పోటీ

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 23 , 2025 | 09:20 AM