Share News

Bihar Elections: 12 సీట్లలో విపక్ష కూటమి మిత్రపక్షాల మధ్య పోటీ

ABN , Publish Date - Oct 21 , 2025 | 02:50 PM

కాంగ్రెస్ పార్టీ 70 సీట్లు డిమాండ్ చేస్తుండగా 52 నుంచి 55 సీట్లు ఇస్తామంటూ ఆర్జేడీ ప్రతిపాదించింది. దీంతో ఇరు భాగస్వామ్య పార్టీల మధ్య సమన్వయలోపం తలెత్తింది. ఇదేవిధంగా వామపక్ష పార్టీలు 40 సీట్లు అడుగుతున్నాయి.

Bihar Elections: 12 సీట్లలో విపక్ష కూటమి మిత్రపక్షాల మధ్య పోటీ
Bihar Assembly Elections

పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly Elections) రెండో విడత నామినేషన్ల ప్రక్రియ సోమవారంనాడు ముగిసింది. దీంతో ఇటు అధికార ఎన్డీయే, విపక్ష మహాకూటమి ఎన్నికల సన్నాహాలను ముమ్మరం చేశాయి. అయితే విపక్ష మహాకూటమి (Mahagathbandan) ఓట్ల షేరింగ్ విషయంలో ఏకాభిప్రాయానికి రావడంలో విఫలమైంది. పలు నియోజకవర్గాల్లో కూటమి మిత్ర పక్షాలు ముఖాముఖీ తలబడుతున్నాయి. 12 నియోజకవర్గాల్లో రాష్ట్రీయ జనతాదళ్ (RJD), కాంగ్రెస్ (Congress), వికాస్‌షీల్ ఇన్సాన్ పార్టీ (VIP), సీపీఐ (CPI) పోటాపోటీగా అభ్యర్థులను నిలబెట్టాయి. అయితే ఈ అనిశ్చితి అక్టోబర్ 23వ తేదీ నాటికి తొలగిపోయే అవకాశాలున్నాయి. రెండో విడత పోటీ చేస్తున్న అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ గడువు అదే తేదీతో ముగియనుంది.


పొత్తు పొత్తే.. పోటీ పోటీయే

మహాఘట్‌బంధన్ భాగస్వాములు ఒకరితో మరొకరు తలబడుతున్న 12 నియోజక వర్గాల్లో బచ్‌వాడా (సీపీఐ-కాంగ్రెస్), నర్కటియాగంజ్ (ఆర్జేడీ-కాంగ్రెస్), బాబుబర్హి (వీఐపీ-ఆర్జేడీ), వైశాలి (కాంగ్రెస్-ఆర్జేడీ), రాజా పాకర్ (కాంగ్రెస్-సీపీఐ), కహల్‌గావ్ (ఆర్జేడీ-కాంగ్రెస్), బిహార్ షరీఫ్ (కాంగ్రెస్-సీపీఐ), సికంద్రా (కాంగ్రెస్-ఆర్జేడీ), చైన్‌పూ‌ర్ (వీఐపీ-ఆర్జేడీ), సుల్తాన్‌గంజ్ (లలన్ కుమార్), కరగ్‌హర్ (కాంగ్రెస్-సీపీఐ), వార్సాలిగంజ్ (ఆర్జేడీ-కాంగ్రెస్) ఉన్నాయి.


సీట్ల పంపకాల డీల్ ఎందుకు కుదరలేదంటే..

కాంగ్రెస్ పార్టీ 70 సీట్లు డిమాండ్ చేస్తుండగా 52 నుంచి 55 సీట్లు ఇస్తామంటూ ఆర్జేడీ ప్రతిపాదించింది. దీంతో ఇరు భాగస్వామ్య పార్టీల మధ్య సమన్వయలోపం తలెత్తింది. ఇదేవిధంగా వామపక్ష పార్టీలు 40 సీట్లు అడుగుతున్నాయి. 2020లో తమ పనితీరును ప్రస్తావిస్తోంది. ఆ ఎన్నికల్లో సీపీఐ (ఎంఎల్) 12 సీట్లు, సీపీఐ, సీపీఎం రెండేసి సీట్లు చొప్పున గెలుచుకున్నాయి. ముఖేష్ సహానీ వీఐపీ సైతం 40 సీట్లు అడిగినప్పటికీ 15 సీట్లే కేటాయించారు. కూటమి గెలిస్తే వీఐపీకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామనే ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. కాగా, మహాకూటమి పార్టీల మధ్య ఓట్లు చీలడం అధికార ఎన్డీయేకు కలిసివచ్చే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన ఆర్జేడీ

అసలు విషయం చెప్పేసిన సీఎం సిద్దరామయ్య.. అదేంటో తెలిస్తే..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 21 , 2025 | 02:54 PM