CM Siddaramaiah: అసలు విషయం చెప్పేసిన సీఎం సిద్దరామయ్య.. అదేంటో తెలిస్తే..
ABN , Publish Date - Oct 20 , 2025 | 01:43 PM
తాను రాజకీయగా ఎదిగేందుకు, మంత్రి అయ్యేందుకు ఆర్‌ఎల్ జాలప్ప కూడా కారణమని సీఎం సిద్దరామయ్య పేర్కొన్నారు. జాలప్ప శతజయంతి సందర్భంగా ఆదివారం జాలప్ప అకాడమీ, జాలప్ప లా వర్సిటీ, శతమానోత్సవ భవనాలను లాంఛనంగా ప్రారంభించారు.
- జాలప్పతోనే రాజకీయంగా ఎదిగా..
- ముఖ్యమంత్రి సిద్దరామయ్య
బెంగళూరు: తాను రాజకీయగా ఎదిగేందుకు, మంత్రి అయ్యేందుకు ఆర్‌ఎల్ జాలప్ప కూడా కారణమని సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah) పేర్కొన్నారు. జాలప్ప శతజయంతి సందర్భంగా ఆదివారం జాలప్ప అకాడమీ, జాలప్ప లా వర్సిటీ, శతమానోత్సవ భవనాలను లాంఛనంగా ప్రారంభించారు. దేవరాజ్ అరసు వసతి పాఠశాల నూతన భవనాలకు శంకుస్థాపన చేశారు. ుహృదయవంత ఆర్‌ఎల్ జాలప్ప జీవనపథ్ పుస్తకాన్ని ఆవిస్కరించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. జాలప్ప వాస్తవాన్ని కఠినంగా చెప్పేవారన్నారు. ఆయన వ్యక్తిత్వం ఎంతో ఉన్నతమైనదని, మనస్ఫూర్తిగా స్పందించేవారన్నారు. సమయస్ఫూర్తితోపాటు చక్కటిపాలనా దక్షులని కొనియాడారు. నాలుగుసార్లు ఎంపీగా గెలుపొంది ఆయన నిర్వహించిన అన్నిశాఖలలోనూ తనదైన ముద్ర వేశారన్నారు. తాను రెవెన్యూ మంత్రి కాదలచుకున్నానని, అయితే ఆర్‌ఎల్ జాలప్ప(RL Jalappa) ప్రోత్సాహంతోనే ఆర్థిక మంత్రి అయ్యానన్నారు.

ఈకారణంగాను తాను 16సార్లు బడ్జెట్ సమర్పించగలిగానన్నారు. కాగా 150మంది విద్యార్థులతో ప్రారంభమైన విద్యాసంస్థ ప్రస్తుతం 9వేలమంది వేర్వేరు విభాగాల్లో చదువుతున్నారని కొనియాడారు. ఇదే సందర్భంగా వివిధరంగాల సాధకులకు జ్ఞాపికలు అందచేసి సత్కరించారు. కార్యక్రమంలో బెంగళూరు గ్రామీణ ఇన్‌చార్జ్, పౌర, ఆహార సరఫరాలశాఖ మంత్రి కేహెచ్ మునియప్ప, ప్రాథమిక విద్యాశాఖ మంత్రి మధు బంగారప్ప, మాజీ స్పీకర్ రమేశ్‌కుమార్, పరిషత్ మాజీ సభాపతి సుదర్శన్, మాజీ మంత్రి పీజీఆర్ సింధ్యా, దొడ్డబళ్ళాపుర ఎమ్మెల్యే ధీరజ్ మునిరాజు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
దీపావళి రోజున మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ముస్లింలకు అట్రాసిటీ చట్టం తీసుకురావాలి
Read Latest Telangana News and National News