Maulana Azad Medical College: ఈ టాప్ కాలేజీలో కేవలం రూ.13,500 ఖర్చుతోనే ఎంబీబీఎస్ చేయొచ్చు..
ABN, Publish Date - Jul 04 , 2025 | 03:08 PM
MBBS in Delhi: మన దేశంలో డాక్టర్ చదువు పూర్తి చేయాలంటే విద్యార్థులకు మెరిట్ మాత్రమే ఉంటే సరిపోదు. ఎంబీబీఎస్ పూర్తయ్యేవరకూ భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే, పేదింటి విద్యా కుసుమాలకు డాక్టర్ పట్టా అందుకునేందుకు ఓ అద్భుత అవకాశం కల్పిస్తోంది మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజ్. ఇక్కడ కేవలం రూ.13,500 ల ఖర్చుతోనే విద్యార్థులు MBBS కోర్సు పూర్తిచేయవచ్చు.
Study MBBS in Delhi under 15k: భారతదేశంలో MBBS కోర్సు పూర్తయ్యేవరకూ విద్యార్థులు రూ. 20 లక్షల నుండి రూ. 1 కోటి వరకూ ఖర్చుచేయాల్సి ఉంటుంది. దీంతో, డాక్టర్ చదవాలనే కోరిక, ప్రతిభ ఉన్నప్పటికీ పేదింటి విద్యార్థులు వెనకడుగు వేస్తుంటారు. తమ ఆశల్నీ మొగ్గలోనే తుంచేసుకుంటారు. అయితే, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు ఢిల్లీలోని మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీ నుంచి చాలా తక్కువ ఫీజుతో MBBS పూర్తి చేయవచ్చు. ఐదున్నరేళ్ల కోర్సుకు వెచ్చించాల్సిన మొత్తం కేవలం రూ. 13,500. ప్రతిభ ఉంటే చాలు. దేశంలోని ఏ విద్యార్థికైనా ఇక్కడ చదివే అవకాశం దక్కుతుంది.
ఢిల్లీలోని మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజ్(MAMC) సంవత్సరానికి కేవలం రూ.13,500కే MBBS కోర్సును అందిస్తోంది. ఇందులో ట్యూషన్, లైబ్రరీ ఫీజులు మొదలైనవి ఉన్నాయి. మొత్తం 250 MBBS సీట్లు ఉన్నాయి. 6 సీట్లు భారత ప్రభుత్వ అభ్యర్థులకు రిజర్వ్ చేశారు. 122 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ క్యాంపస్ ఢిల్లీ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉంది. ఈ కళాశాలలో విద్యార్థులకు అన్ని సదుపాయాలూ ఉన్నాయి. భారతదేశంలోని ఇతర వైద్య కళాశాలల కంటే పేద విద్యార్థులకు ఈ కాలేజీ చాలా మంచి ఎంపిక.
ఎన్ని MBBS సీట్లు ఉన్నాయి?
మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, MBBS కి మొత్తం 250 సీట్లు ఉన్నాయి. మెడికల్ డిగ్రీలతో పాటు అనేక ఇతర వైద్య కోర్సులు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఈ కళాశాలలో విద్యార్థుల కోసం ఆడిటోరియంలు, డిజిటల్ క్లాస్ రూమ్స్, అత్యాధునిక ల్యాబ్స్, లైబ్రరీ సహా అనేక సౌకర్యాలు ఉన్నాయి. మెడికల్ UG కోర్సుల కోసం మొత్తం 7 హాస్టళ్లు ఉన్నాయి. వీటిలో 24 గంటలూ Wi-Fi సౌకర్యం కూడా ఉంటుంది.
MBBS ఫీజు ఎంత?
ఇక్కడ MBBS కోర్సు మొత్తం ఫీజు దాదాపు రూ.13,500. కళాశాల అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, వార్షిక ట్యూషన్ ఫీజు రూ.240, లైబ్రరీ ఫీజు రూ.100, వార్షిక ల్యాబ్ ఫీజు రూ.10. ఢిల్లీ విశ్వవిద్యాలయం నిర్దేశించిన యూనివర్సిటీ ఫీజు రూ.300, సెక్యూరిటీ ఫీజు రూ.2000, వైద్య పరీక్ష ఫీజు కేవలం రూ.25. విద్యార్థుల కోర్సు పూర్తయిన తర్వాత ఈ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎస్బీఐలో ఉద్యోగాలు.. నెలకు రూ.85 వేల జీతం, అప్లై
డిగ్రీ అర్హతతో బ్యాంక్ ఆఫ్ అమెరికాలో ఫ్రీ ఇంటర్న్‌షిప్.. జీతం గంటకు రూ.3,419..
For Educational News And Telugu News
Updated Date - Jul 04 , 2025 | 04:17 PM