ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వెచ్చటి వెన్నెల అను ఒక platonic poem

ABN, Publish Date - Apr 28 , 2025 | 01:34 AM

చుట్టూ చీకటి కమ్ముకునింది‌. మనిద్దరం పచార్లు చేస్తూ. నేనేమో రెండోసారి నీకోసం Mens Hostel I నుండి North Ladies Hostel కి వాన తుంపర్లలో పలుచగా తడిసొచ్చి నువ్వేదో చెబుతావని ఎదురుచూస్తూ...

చుట్టూ చీకటి కమ్ముకునింది‌. మనిద్దరం పచార్లు చేస్తూ. నేనేమో రెండోసారి నీకోసం Mens Hostel I నుండి North Ladies Hostel కి వాన తుంపర్లలో పలుచగా తడిసొచ్చి నువ్వేదో చెబుతావని ఎదురుచూస్తూ. నిశ్శబ్దంగా నీతో నడుస్తూ. అటు ఇటు రెండుమార్లు నడిచాక బహుశా చెప్పాలని నన్నాపావు- గుండె కొట్టుకుంటున్నట్టు ఆగి వెలుగుతున్న వీధి లైట్‌ కింద, ఆ ఒకే కాంతి ఆ దారి మొత్తమ్మీద. ‘‘నీతో స్నేహం ఎండాకాలంలో కురిసిన వానజల్లులా బావుంది, వెచ్చని కౌగిలిలానూ ఉంది. మన స్నేహమొక శాశ్వతత్వంలా. అబ్బాయీ! కౌగిలించుకోవచ్చా నిన్నొకసారి?’’ అని నువ్వన్నప్పుడు నవ్వుతూ చాలా తేలికగా అన్నాను నీ మాటల్లోని కవితాత్మకతనీ జీవాత్మని గుర్తించక- ‘‘ఎంతమందో కౌగిలించుకునుంటారు నన్ను, పెద్ద తేడా ఏముంది నువ్వు కౌగలించుకున్నా, పర్లేదు, ఇవ్వు’’. అందరికిమల్లే నువ్వూ తేలికగా హత్తుకుంటావనుకున్నాను. ఎన్ని క్షణాలు కౌగిలించుకుని ఉంటామో గుర్తులేదు. కాస్త నిశ్శబ్దమూ ప్రశాంతత. పిల్లవాడు చందమామని అందులోని కుందేలుని మేఘాల వంటి మెత్తని కొండలని కౌగిలించుకుని నిదరోతున్నంత ప్రశాంతత.


చెప్పకూడదు ఇలా ఇప్పుడు:

మనం కలుసుకోలేనంత దూరమయ్యి, కలిస్తే మరొక్కసారి హత్తుకోవాలన్న తపన.

అమ్మాయీ,

ఎవరన్నా దగ్గరకొస్తే చికాకేస్తుంది తెలుసా! బహుశా మనసంతా నిరాకరణను కమ్ముకున్నదేమో నువ్వు రావాలని. నీ కౌగిలిలో పొందిన వెచ్చటి వెన్నెల ఇక్కడెవరిలోనూ దొరకదని నీకూ తెలుసు. నువ్వెళ్ళిపోయాక కౌగిలింతలన్నీ ముళ్ళదేహాలపై వాలి పావురానికి గాయమైనట్లు, చీకటిలో రాళ్ళు పరిచిన దారిలో చెప్పుల్లేకుండా నడుస్తున్నట్లు, కాలిపోతున్న చుట్టుగోడలు మధ్య ఇరుక్కుపోయినట్లు, నలిపిన కాగితంపై బొమ్మ గీసినట్లు.

అమ్మాయీ! ఎలా ఉన్నావు ఇంతకీ?

నీకూ ఇలాగే మనసు పీకుతోందా?

లిఖిత్ కుమార్ గోదా

96400 33378

సోమేపల్లి అవార్డుల ప్రదానోత్సవం

ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం – గుంటూరు జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో కీ.శే. సోమేపల్లి వెంకటసుబ్బయ్య జయంతి, సాహిత్య పురస్కారాల ప్రదానోత్సవం మే 1 సా.5గంటలకు కొరటాల భవన్‌, బ్రాడీపేట, గుంటూరులో జరుగుతుంది. అధ్యక్షత చలపాక ప్రకాష్; ముఖ్య అతిథులు పాపినేని శివశంకర్, పెనుగొండ లక్ష్మీనారాయణ. కథా పురస్కారం సి. యమున (‘రెక్కలొచ్చాయి’), కవితా పురస్కారం ఖాదర్ షరీఫ్‌ (‘జీవ రహస్యలిపి’) స్వీకరిస్తారు.

వశిష్ఠ సోమేపల్లి


ఉమ్మడిశెట్టి అవార్డుల ప్రదానోత్సవం

ఉమ్మడిశెట్టి అవార్డుల ప్రదానోత్సవం మే 4, ఫిలింభవన్‌, కరీంనగర్‌లో జరుగుతుంది. ఉమ్మడిశెట్టి సత్యాదేవి అవార్డును వైష్ణవిశ్రీ, ఉమ్మడిశెట్టి సతీష్ కుమార్ యువ పురస్కారాన్ని నందకిషోర్, రాధేయ కవితా పురస్కారాన్ని సుధామురళి స్వీకరిస్తారు. సభలో రాధేయ, నలిమెల భాస్కర్, అన్నవరం దేవేందర్, గాజోజు నాగభూషణం, అద్దేపల్లి ప్రభు, మానస చామర్తి పాల్గొంటారు.

ఉమ్మడిశెట్టి లిటరరీ ట్రస్ట్

ఈ వార్తలు కూడా చదవండి..

Congress party: ఏపీలో కాంగ్రెస్ పార్టీ నేత దారుణ హత్య

Visakhapatnam: యాప్‌లతో ఆర్థిక నేరాలకు పాల్పడుతోన్న ముఠా గుట్టు రట్టు

AP Police: పోలీసులను చూసి.. ఆ దొంగ ఏం చేశాడంటే..

Rains: ఏపీలో భారీ వర్షాలు.. నీట మునిగిన వరి ధాన్యం

Simhachalam: స్వామి చందనోత్సవం.. సమీక్షించిన హోం మంత్రి

TDP Supporter: రెచ్చిపోయిన వైసీపీ నేతలు.. టీడీపీ కార్యకర్తకు కత్తిపోట్లు

BRS Meeting In Elkathurthy: బీఆర్ఎస్ సభలో రసాభాస..

For Telangana News And Telugu News

Updated Date - Apr 28 , 2025 | 01:34 AM