ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఆ రాశి వారికి ఈ వారం ఆర్ధికంగా బాగుంటుంది...

ABN, Publish Date - Dec 07 , 2025 | 07:22 AM

ఆ రాశి వారికి ఈ వారం ఆర్ధికంగా బాగుంటుంది... అని ప్రముఖ జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు. అయితే.. కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అలాగే.. పిల్లలకు మంచి జరుగుతుందని, ఆహ్వానం అందుకుంటారని తెలుపుతున్నారు. మొత్తంగా.. ఈ వారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే...

అనుగ్రహం

7 - 13 డిసెంబర్‌ 2025

పి.ప్రసూనా రామన్‌

మేషం

అశ్విని, భరణి,

కృత్తిక 1వ పాదం

ప్రతికూలతలు అధికం. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. అనుభవజ్ఞులను సంప్రదించండి. ఊహించని ఖర్చు చికాకు పరుస్తుంది. అవసరాలు వాయిదా వేసుకుంటారు. చెల్లింపుల్లో జాప్యం తగదు. పనులు మొక్కుబడిగా పూర్తిచేస్తారు. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. పిల్లలకు మంచి జరుగుతుంది. ఆహ్వానం అందుకుంటారు. పరిచయాలు బలపడతాయి. ఆరోగ్యం బాగుంటుంది.

వృషభం

కృత్తిక 2,3,4; రోహిణి,

మృగశిర 1,2 పాదాలు

సంప్రదింపులు వాయిదా పడతాయి. చిన్న విషయానికే చికాకుపడ తారు. ఓర్పుతో యత్నాలు సాగించండి. అవకాశాలను వదులుకోవద్దు. స్థిరాస్తి ధనం అందుతుంది. ఖర్చులు అదుపులో ఉండవు. పనులు మందకొడిగా సాగుతాయి. అందరి తోనూ మితంగా సంభాషించండి. కొత్త సమస్య ఎదురయ్యే సూచనలున్నాయి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. విజ్ఞతతో వివాదాలు పరిష్కరించుకుంటారు.

మిథునం

మృగశిర 3,4; ఆర్ద్ర,

పునర్వసు 1,2,3 పాదాలు

ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. రావలసిన ధనం అందుతుంది. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. ధనసహాయం, ప్రైవేట్‌ సంస్థలో మదుపు తగదు. ఆచితూచి అడుగే యాల్సిన సమయం. అనాలోచిత నిర్ణయం నష్టం కలిగిస్తుంది. పనులు అర్థాంతరంగా ముగిస్తారు. ముఖ్యమైన పత్రాలు అందు తాయి. ఇంటి విషయాలపై దృష్టిపెడతారు. సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు.

కర్కాటకం

పునర్వసు 4వ

పాదం, పుష్యమి, ఆశ్లేష

అన్నివిధాలా యోగదాయకమే. మాట నిలబెట్టుకుంటారు. బంధువులకు మీపై ప్రత్యేకాభిమానం కలుగుతుంది. వ్యవ హారాలు మీ సమక్షంలో సాగుతాయి. వస్త్ర ప్రాప్తి, వాహనసౌఖ్యం ఉన్నాయి. చేసిన పనులే తిరిగి చేయవలసి వస్తుంది. తరచూ ఆత్మీయులతో సంభాషిస్తారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. కుటుంబసౌఖ్యం పొందుతారు. పందాలు, బెట్టింగ్‌లకు పాల్పడవద్దు.

సింహం

మఖ, పుబ్బ,

ఉత్తర 1వ పాదం

ఆర్థికంగా బాగుంటుంది. అనుకున్న ఖర్చులే ఉంటాయి. ఆప్తులకు సాయం చేస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. నోటీసులు అందుకుంటారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. గృహమరమ్మతులు చేపడతారు. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. ఆరోగ్యం కుదుటపడుతుంది.

కన్య

ఉత్తర 2,3,4; హస్త,

చిత్త 1,2 పాదాలు

కార్యసాధనకు మరింత శ్రమించాలి. కలిసివచ్చిన అవకాశాన్ని తక్షణం అందిపుచ్చుకోండి. కొందరి వ్యాఖ్యలు ఆలో చింపచేస్తాయి. అనుమానాలు, అపోహలకు తావివ్వవద్దు. ముఖ్యుల కలయిక వీలపడదు. పనులు, కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. స్థిరాస్తి ధనం అందుతుంది. వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. వేడుకల్లో అందరినీ ఆకట్టుకుంటారు..

తుల

చిత్త 3,4; స్వాతి,

విశాఖ 1,2,3 పాదాలు

ప్రతికూలతలు అధికం. మీ కష్టం మరొకరికి కలిసివస్తుంది. ఆలోచనలు నిలకడగా ఉండవు. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. సోదరవర్గం వారితో సమస్యలు తలెత్తుతాయి. ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు. తెలియని వెలితి వెన్నాడు తుంది. చెల్లింపుల్లో జాగ్రత్త. చుట్టుపక్కల వారిని ఓ కంట కనిపెట్టండి. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. కొత్త యత్నాలకు శ్రీకారంచుడతారు.

వృశ్చికం

విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ

నిర్విరామంగా శ్రమిస్తారు. అవకాశాలు అందినట్టే అంది చేజారిపోతాయి. మీ సమర్థతపై నమ్మకం సన్నగిల్లుతుంది. మీ ఉన్నతిని చాటుకోవటానికి విపరీతంగా ఖర్చు చేస్తారు. వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. మొహమాటాలు, భేషజాలకు పోవద్దు. వాస్తవదృక్పథంతో ఆలోచించండి. అనుభవజ్ఞులను సంప్రదించటం శ్రేయస్కరం. ఆత్మీయులతో తరచూ సంభాషిస్తుంటారు. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది.

ధనుస్సు

మూల, పూర్వాషాఢ,

ఉత్తరాషాఢ 1వ పాదం

సర్వత్రా ఆశాజనకం. ప్రణాళి కాబద్థంగా ముందుకు సాగుతారు. మీ కృషి ఫలిస్తుంది. లక్ష్యానికి చేరువవుతారు. కలిసి వచ్చిన అవకాశాన్ని తక్షణం అందిపుచ్చు కోండి. అనుమానాలకు తావివ్వవద్దు. స్థిరాస్తి ధనం అందుతుంది. పెట్టుబడులపై దృష్టి పెడతారు. అర్థాంతరంగా ముగిసిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. మీ సాయంతో ఒకరికి లబ్ధి చేకూరుతుంది. వేడుకల్లో అత్యుత్సాహం తగదు.

మకరం

ఉత్తరాషాఢ 2,3,4;

శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు

యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఆత్మస్థైర్యంతో అడుగు ముందు కేస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. ఖర్చులు అధికం. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. ఆప్తుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. ఫోన్‌ సందేశాలు పట్టించుకోవద్దు.

కుంభం

ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

కార్యసాధనకు మరింత శ్రమించాలి. పరిస్థితులు నిదానంగా చక్క బడతాయి. మాటతీరు ఆకట్టుకుంటుంది. కష్ట్లమనుక్ను పనులు తేలికగా పూర్తి చేస్తారు. ఆర్థికంగా బాగుంటుంది. విలాసాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. మీ ఇష్టాయి ష్టాలను కచ్చితంగా తెలియజేయండి. ఆరోగ్యం పట్ల అలక్ష్యం తగదు. ఊహించని సంఘటన ఎదురవుతుంది. మీ అభిప్రాయాలకు ఆశించిన స్పందన లభిస్తుంది.

మీనం

పూర్వాభాద్ర 4వ

పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. లక్ష్యానికి చేరువవుతారు. పట్టుదలతో యత్నాలు సాగించండి. అవకాశాలు కలిసి వస్తాయి. అప్రమత్తంగా ఉండాల్సిన సమ యం. అనవసర విషయాల్లో జోక్యం తగదు. స్థిరచరాస్తుల ధనం అందుతుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. సకాలంలో వాయి దాలు చెల్లిస్తారు. దంపతుల మధ్య సఖ్యత లోపం. గృహమరమ్మతులు చేపడతారు. వాహనం, విలువైన వస్తువులు జాగ్రత్త.

ఈ వార్తలు కూడా చదవండి..

రాజకీయాలకతీతంగా అభివృద్ధిలో భాగస్వాములు కావాలి

చుక్కలు చూపిస్తున్న ఇండిగో

Read Latest Telangana News and National News

Updated Date - Dec 07 , 2025 | 07:22 AM