ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Miraculous Lamp: నూరేళ్లుగా నిత్యం వెలుగుతున్న దీపం.. ఎక్కడుందంటే?

ABN, Publish Date - Nov 08 , 2025 | 05:37 PM

సాధారణంగా మనం దీపం పెట్టామంటే.. అందులో నూనె అయిపోగానే కొండెక్కుతుంది. నిరంతర పర్యవేక్షణలో ఉంటే గానీ ఆ దీపం ఆరిపోకుండా చూస్కోవడం సాధ్యపడదు. కానీ, ఎలాంటి నూనె సాయం లేకుండా.. ఓ దీపం వందేళ్లుగా వెలుగుతోందంటే నమ్ముతారా.! అవునండీ.. ఇది నిజం. ఈ కథనం చదవండి మీకే తెలుస్తుంది.

Varanasi Eternal Lamp

ఇంటర్నెట్ డెస్క్: వందేళ్ల క్రితం వెలిగించిన ఓ దీపం ఇప్పటికీ వెలుగుతూనే ఉంది. అందులోకి ఎవరూ ఎలాంటి నూనె పోయరు, కనీసం దాని ఒత్తి కూడా మార్చరు. అయినా అది మాత్రం వెలుగును ఇస్తూనే ఉంటుంది. ఎంతటి విపత్కర పరిస్థితులు వచ్చినా.. దాని నుంచి వచ్చే వెలుతురులో ఏ మాత్రం తేడా ఉండదు. అంతటి మహత్యం కలిగిన ఆ అద్భుత దీపం వారణాశిలో కలదు. ఈ దీపాన్ని చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు.

ఇదీ చరిత్ర..

1923లో మహాశక్తి ధ్యానం సందర్భంగా ఓ సన్యాసి.. ఈ దీపాన్ని వెలిగించినట్టు చరిత్ర చెబుతోంది. ఈ జ్యోతి ఎప్పటికీ వెలుగు చిహ్నంగా ఉండాలని విశ్వసిస్తూ.. నాడు ఆయన దీనిని వెలిగించారు. మనిషిలో మానవత్వం ఉన్నంతవరకూ ఈ దీపం ఆరిపోదని ఋషి చెప్పినట్టు చరిత్ర ద్వారా తెలుస్తోంది. వాన కురిసినా, వరదలు వచ్చినా, తుపాను వంటి విపత్తులెన్నొచ్చినా.. ఈ దీపం మాత్రం చెక్కు చెదరకుండా స్థిరమైన కాంతినిస్తుంది. కనీసం అందులోని ఒత్తి కూడా నల్లబడదు. అందుకే అక్కడి ప్రజలు దీనిని 'అక్షయ దివ్య'గా వ్యవహరిస్తారు.

విశ్వ శక్తి తోడై..

నిత్యం వెలిగే ఈ దీపాన్ని పరిశీలించిన పలువురు శాస్త్రవేత్తలూ విస్తుపోయారు. అక్కడి వాతావరణ పరిస్థితులు సహజంగా ఉండటం, మానవ మార్పులు చోటు చేసుకుంటున్నప్పటికీ దీపం వెలుగులీనుతూనే ఉంటుందని తేల్చారు. ఈ దీపం కేవలం సన్యాసి శక్తి ద్వారానే కాకుండా.. విశ్వ శక్తితో కూడుకుని వెలుగుతుందని స్థానికులు నమ్ముతారు. దీనిని ఆధ్యాత్మిక శక్తికి మూలంగా భావిస్తారు. ఈ దీపం వెలుగుతున్నంత కాలం వారణాసి ఆత్మ అమరత్వం కలిగి ఉంటుందని అక్కడి వారి ప్రగాఢ విశ్వాసం.

ఈ వార్తలు కూడా చదవండి..

కార్తీక పౌర్ణమి.. శివ నామస్మరణతో మార్మోగిన దేవాలయాలు

కార్తీక మాసంలో ఈ నాలుగు ఆచరిస్తే..

For More Devotional News And Telugu News

Updated Date - Nov 09 , 2025 | 01:04 PM