ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Vaikuntha Ekadashi: వైకుంఠ ఏకాదశి వేళ ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం..

ABN, Publish Date - Dec 30 , 2025 | 07:48 AM

అత్యంత పవిత్రమైన వైకుంఠ ఏకాదశి రోజు ఇలా చేస్తే.. లక్ష్మీ కటాక్షం కలుగుతుందంటారు. అందుకోసం ఏం చేయాలంటే..

ఏడాదిలో చాలా పండగలే ఉంటాయి. కానీ పవిత్రమైన రోజులు మాత్రం కొన్నే ఉంటాయి. వాటిలో తొలి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి దీనికి మరో పేరు ముక్కోటి ఏకాదశి. ఈ ముక్కోటి ఏకాదశి.. ఈ రోజు అంటే మంగళవారం (డిసెంబర్ 30) జరుపుకుంటున్నారు. ఈ పర్వదినం నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని వైష్ణవాలయాలకు భక్తులు పోటెత్తారు. ఈ దేవాలయాలన్నీ గోవింద, శ్రీలక్ష్మీ నరసింహ ప్రసన్న నామ స్మరణతో మార్మోగుతున్నాయి. తిరుమల, ద్వారకా తిరుమల (చిన్న తిరుపతి), అన్నవరం, భద్రాచలం, శ్రీకూర్మం, మంగళగిరి, అంతర్వేది, వాడపల్లి శ్రీవెంకటేశ్వర స్వామి వారి దేవాలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి.

ఈ రోజు ఇలా చేయాలి..

హరినామ స్మరణ..

ఈ రోజు హరినామ స్మరణ చేయాలి. పగలు నిద్రపోవడం మంచిది కాదు. రాత్రి అంతా జాగరణ చేస్తే పుణ్యం కలుగుతుంది.

ఈ రోజు.. ఇలా చేయండి..

అన్నదానం చేస్తే ఎంతో మంచి జరుగుతుంది. పేదలకు, లేనివారికి తూచిన వాటిని దానంగా ఇస్తే పుణ్యం కలుగుతుంది.

ఉపవాసం, జాగరణ..

శ్రీమహావిష్ణువును స్తుతిస్తే మోక్షం లభిస్తోంది. వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వారం తెరిచి ఉంచుతారు. ఈ రోజు ఉపవాసం ఉండి.. ద్వాదశి రోజు అతిథి లేకుండా భోజనం చేయకూడదని చెబుతారు. ఏకాదశి రోజు ఉపవాసం చేస్తే పాప విముక్తులవుతారని పురాణాలు సైతం చెబుతున్నాయి.

ఈ మంత్రాన్ని జపిస్తే..

‘ఓం నమో నారాయణ’ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మంచిది. ఈ రోజు ఈ నామాన్ని జపించడం వల్ల అనుకున్న కార్యాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయని నమ్ముతారు. అలాగే గీతా పారాయణం, గోవింద నామస్మరణ చేస్తే విశేష ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రోజు గోసేవ, పురాణ శ్రవణం, దానధర్మాలు వంటివి చేయడం వల్ల మోక్లం కలుగుతుందంటారు. ఈ రోజు ఏకాదశి వ్రతాన్ని నిష్టగా ఆచరిస్తే.. జ్ఞానవంతులు అవుతారంటారు.

లక్ష్మీ కటాక్షం కలగాలంటే..?

తులసి మొక్క, కప్పుకునే దుప్పటి, ధాన్యం తదితర వస్తువులు పేదలకు దానంగా ఇవ్వడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఆహారం, దుస్తులు, ఆర్థిక సహాయం సైతం ఇవ్వవచ్చు. తద్వారా శ్రీమహాలక్ష్మీ, విష్ణువు అనుగ్రహం కలుగుతుంది. గోవును దానంగా ఇస్తే.. అంతా మంచి జరుగుతుందని చెబుతారు.

ఈ రోజు చేయకూడనవి..

తులసి ఆకులు..

ఈ రోజు శ్రీమహావిష్ణువుకు అత్యంత ఇష్టమైన తులసి ఆకులు. వాటిని ఈ రోజు కోయకూడదు. ఆయనకు ఈ రోజు ఈ ఆకులు సమర్పించాలి. అంటే.. ముక్కోటి ఏకాదశి ముందు రోజు తులసి ఆకులు కోసి.. పూజకు సిద్ధం చేసుకోవాలి.

మద్యం, మాసం..

ఈ రోజు మాంసాహారంతోపాటు ఉల్లి, వెల్లుల్తి తీసుకోకూడదు. అలాగే అన్నంతోపాటు బియ్యంతో చేసిన ఆహార పదార్థాలు తీసుకొవద్దని సూచిస్తారు.

వీటికి దూరంగా..

ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి. ఎవరి బాధ పెట్టడం కానీ.. దూషించడం కానీ చేయకూడదు. ఎవరితో ఘర్షణ పడడం మంచిది కాదు.

Updated Date - Dec 30 , 2025 | 07:55 AM