ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Trigrahi Yoga: 300 ఏళ్ల తర్వాత అరుదైన రాజయోగం.. ఈ రాశుల వారికి జాక్ పాటే..

ABN, Publish Date - Aug 12 , 2025 | 05:46 PM

గ్రహాల సంచారం మానవ జీవితంపై గణనీయ ప్రభావాన్ని చూపుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. కొన్ని గ్రహాల సంయోగం అరుదైన యోగాలను కల్పిస్తోంది. ఇవి ఒక వ్యక్తి ఆర్థిక, సామాజిక, వ్యక్తిగత జీవితంలో భారీ మార్పులను తీసుకురానున్నాయి.

Trigrahi Yoga

గ్రహాల సంచారం మానవ జీవితంపై గణనీయ ప్రభావాన్ని చూపుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. కొన్ని గ్రహాల సంయోగం అరుదైన యోగాలను కల్పిస్తోంది. ఇవి ఒక వ్యక్తి ఆర్థిక, సామాజిక, వ్యక్తిగత జీవితంలో భారీ మార్పులను తీసుకురానున్నాయి. ఈ నేపథ్యంలో 2025లో.. మూడు శతాబ్దాల తర్వాత మూడు అరుదైన యోగాలు అంటే త్రిగ్రహి యోగం, భద్ర యోగంతోపాటు మాలవ్య రాజయోగం ఒకే సమయంలో సంభవిస్తున్నాయి. ఈ యోగాలు.. కొన్ని రాశులకు అపారమైన శుభ ఫలితాలను ఇవ్వనున్నాయి.

త్రిగ్రహి యోగం..

ఈ సారి శని, బుధుడు, శుక్రుడు ఒకే రాశిలో యోగాన్ని ఏర్పరుస్తున్నారు. భద్ర యోగం, మాలవ్య రాజయోగం.. ఈ సమయంలో కొంత మందికి అరుదైన అదృష్టాన్ని తెస్తుంది. ఇది వారికి గొప్ప అవకాశాల సమయంగా మారుతోంది.

వృశ్చిక రాశి: ఈ రాశి వారికి ఈ యోగం చాలా శుభప్రదంగా ఉండనుంది. మీరు ఊహించని అదృష్టాన్ని పొందుతారు. విదేశీ అవకాశాలను అందుకోవచ్చు. బోనస్‌లు, అదనపు ఆదాయం లేదా పెట్టుబడుల నుంచి లాభం పొందే అవకాశం ఉంది. శుక్రుని ప్రభావం కారణంగా.. ఆర్థిక సంపదలో భారీ పెరుగుదల ఉంటుంది. అలాగే చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు సైతం పూర్తవుతాయి. అన్నిరంగాల్లో విజయం సాధించడానికి ఇది సరైన సమయం.

సింహరాశి వారు బుధుడు, శుక్రుడు, శని కలయిక కారణంగా.. వారి ఆర్థిక, సామాజిక జీవితాల్లో కొత్త మలుపులు చూస్తారు. కొత్త అవకాశాలు రావచ్చు. ఇంట్లో శుభ సంఘటనలు జరగవచ్చు. వ్యాపారంలో లాభంతోపాటు వృత్తిలో మెరుగుదల ఉండే అవకాశం ఉంది.

మేష రాశి: ఈ రాశి వారికి సమాజంలో గౌరవం పెరుగుతుంది. వైవాహిక జీవితంలో ఆనందం పెరుగుతుంది. ఆస్తి సంబంధిత వివాదాలు పరిష్కారమవుతాయి. ఆకస్మిక ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఉంది.

తులరాశి: ఈ రాశి వారికి వైవాహిక జీవితంలో ఆనందం, శాంతి లభిస్తుంది. వ్యాపారవేత్తలు భారీ లాభాలను ఆర్జించే అవకాశాలున్నాయి. జీవితంలో శాంతి, శ్రేయస్సు పెరుగుతుంది. సమాజంలో పేరు, ప్రఖ్యాతలు కచ్చితంగా పెరుగుతాయి. ఇబ్బందులు తొలుకుతాయి.

మిథున రాశి: ఈ త్రిగ్రహి యోగం వల్ల ఈ రాశి వారికి మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కుటుంబ వివాదాలు తొలిగిపోతాయి. డబ్బుకు సంబంధించిన సమస్యలు పరిష్కారమవుతాయి. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది.

అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈ యోగాలు కొన్ని రాశి చక్ర గుర్తులను ప్రభావితం చేయడమే కాకుండా.. ఇతరుల జీవితాలపై కూడా కొంత ప్రభావాన్ని చూపుతాయి. అయితే, ప్రతి వ్యక్తి జాతక ఫలితం.. వారి వ్యక్తిగత జాతక చక్రంపై ఆధారపడి ఉంటుంది.

ఈ వార్తలు కూడా చదవండి..

శ్రీ సత్య సాయి శతజయంతి ఉత్సవాల ప్రారంభానికి రంగం సిద్ధం

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Aug 12 , 2025 | 06:21 PM