Share News

Sri Sathyasai Centenary Celebrations: శ్రీ సత్య సాయి శతజయంతి ఉత్సవాల ప్రారంభానికి రంగం సిద్ధం

ABN , Publish Date - Aug 11 , 2025 | 09:03 PM

ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక సరిహద్దుల్లోని సత్యసాయి గ్రామం వేదికగా భగవాన్ శ్రీసత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.

Sri Sathyasai Centenary Celebrations: శ్రీ సత్య సాయి శతజయంతి ఉత్సవాల ప్రారంభానికి రంగం సిద్ధం

అమరావతి, ఆగస్ట్ 11: ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక సరిహద్దుల్లోని సత్యసాయి గ్రామం వేదికగా భగవాన్ శ్రీసత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. ఈ దశాబ్దంలోనే కని వినీ ఎరుగని రీతిలో ఈ ఉత్సవాలను 100 రోజుల పాటు నిర్వహించనున్నామని శ్రీమధుసూదన్ సాయి గ్లోబల్ హ్యుమానిటేరియన్ మిషన్ సోమవారం వెల్లడించింది. ఈ ఉత్సవాల్లో భాగంగా 100 దేశాను ఒకే వేదిక మీదకు తీసుకు వచ్చి వరల్డ్ కల్చరల్ ఫెస్టివల్‌ని నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఈ ఉత్సవాలు ఆగస్ట్ 16వ తేదీన ప్రారంభమై.. నవంబర్ 23వ తేదీ వరకు జరుగుతాయని చెప్పింది. అంటే 100 రోజులపాటు 100 దేశాలను..కళలు, సంగీతం, ఆధ్యాత్మికం తదితర సేవల ద్వారా ఈ ప్రపంచాన్ని ఒక తాటిపైకి తీసుకురాగలమన్న సత్యన్ని ఈ ఉత్సవాల ద్వారా ప్రపంచానికి చాటనున్నట్లు వివరించింది.

Satya-sai-baba.jpg


ఈ సత్యసాయి గ్రామం వేదికగా ప్రతి రోజు.. ఒక్కో దేశానికి చెందిన కళాకారులు తమ కళలు, సంస్కృతి ప్రదర్శిస్తారని పేర్కొంది. ఆయా దేశాల ఆధ్యాత్మిక, సంస్కృతిక మూలాలను ఈ వేదికగా ప్రముఖులు పరిచయం చేస్తారని చెప్పింది. అనంతరం వన్ వరల్డ్.. వన్ ఫ్యామిలీ మిషన్ వ్యవస్థాపకులు, ఆధ్యాత్మిక గురువు సద్గురు శ్రీమధుసూదన్ సాయి ప్రసంగిస్తారని వివరించింది. అలాగే ఆ యా దేశాల్లో అత్యుత్తమ సేవలందించి ప్రముఖులకు గ్లోబల్ హ్యుమానిటేరియన్ అవార్డులను అందిజేయనున్నారని పేర్కొంది. ఇక ఈ వేడుకల్లో భాగంగా అతిరుద్ర మహా యజ్జం, దుర్గాపూజ వంటి ఆధ్యాత్మిక ఉత్సవాలు నిర్వహించనున్నారు.

Sai-baba.jpg


మరో వైపు ఈ ఉత్సవాల ముగింపు లోపు అంటే.. నవంబర్‌లో సత్యసాయి గ్రామంలో నిర్మించిన 600 పడకల ఆసుపత్రిని ప్రారంభించనున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రైవేట్ ఆసుపత్రి ఇది అని వివరించింది. ఈ ఆసుపత్రిలో బిల్లింగ్ కౌంటర్ అనేది ఉండదని స్పష్టం చేసింది. అన్ని వర్గాల వారికి ఈ ఆసుపత్రిలో వైద్య సేవలన్నీ ఉచితంగా అందిస్తారని పేర్కొంది. 40 దేశాలకు చెందిన 400 మంది మ్యూజిషియన్స్‌తో ప్రపంచ సాయి సింపనీ వరల్డ్ ఆర్కెస్ట్రా ప్రదర్శన నిర్వహిస్తామంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారిలో 170 మంది సత్యసాయి యూనివర్సిటీ ఫర్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్‌కి చెందిన విద్యార్థులేనని వివరించింది. నవంబర్ 23వ తేదీన భగవాన్ శ్రీసత్యసాయి బాబా వారి శత జయంతి వేడుకలతో ఈ ఉత్సవాలు ముగియనున్నాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Aug 11 , 2025 | 09:08 PM