ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Tirumala: సకల పాపహరణాలు.. సప్త తీర్థాలు

ABN, Publish Date - Sep 21 , 2025 | 01:03 PM

‘తీర్థాల సన్నిధి యందు స్నానం సేయగనే పుణ్యములు పొంగునయా’ అని తిరుమల కొండల్లోని పుణ్య తీర్థాల గురించి తాళ్లపాక అన్నమా చార్యులు ఓ కీర్తనలో చెబుతారు. శేషాచలం అంతా తీర్థాల మయం. ఈ కొండల్లో 66కోట్ల పుణ్యతీర్థాలు ఉన్నాయని బ్రహ్మపురాణం, స్కంధ పురాణం వెల్లడిస్తాయి.

తిరుమల: ‘తీర్థాల సన్నిధి యందు స్నానం సేయగనే పుణ్యములు పొంగునయా’ అని తిరుమల కొండల్లోని పుణ్య తీర్థాల గురించి తాళ్లపాక అన్నమా చార్యులు ఓ కీర్తనలో చెబుతారు. శేషాచలం అంతా తీర్థాల మయం. ఈ కొండల్లో 66కోట్ల పుణ్యతీర్థాలు ఉన్నాయని బ్రహ్మపురాణం, స్కంధ పురాణం వెల్లడిస్తాయి. అందుకే స్వామి కొండలను తీర్థ సమూహం అని కూడా అంటారు. వీటిలో ధర్మ, జ్ఞాన, భక్తి, వైరాగ్య, ముక్తి ప్రసాదించే ఏడు తీర్థాలను ప్రత్యేకంగా పేర్కొంటారు. ఈ తీర్థాల్లో ఆయా పుణ్యగడియల్లో స్నానమాచరిస్తే సర్వపాపాలు తొలగి ముక్తి లభిస్తుందన్నది పురాణ వైశిష్య్టం.

పుష్కరిణి

శ్రీవారి దర్శనానికి వెళ్లే ముందు భక్తులు తిరుమల ఆలయం పక్కనే ఉత్తరదిక్కులో ఉండే పుష్కరిణలో స్నానమాచరించటం క్షేత్ర సంప్రదాయం. గోవిందుడి పుష్కరిణిలో స్నానమాచరిస్తే 364 తీర్ధాల్లో స్నానమాచరించినంత పుణ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం. గరుత్మంతుడు వైకుంఠం నుంచి ఈ పుష్కరిణి తీసుకొచ్చి తిరుమలలో ఏర్పాటు చేసినట్లు పురాణపండితులు చెబుతారు. క్రీ.శ 1468లో సాళ్వ నరసింగరాయులు పుష్కరిణి మధ్యలోని నిరాళీ మండపాన్ని, క్రీ.శ 15వ శతాబ్దంలో తాళ్ళపాక వంశీయులు మెట్లను నిర్మించారు. స్వామి చక్రస్నానాలను ఇక్కడే నిర్వహిస్తారు.

కుమారధార

తిరుమల ఆలయానికి 10 కిలోమీటర్ల దూరంలో ఈ తీర్థం ఉంది. మాఘ పౌర్ణమి రోజు ఇక్కడ స్నానం చేసినట్లయితే సంతానప్రాప్తి కలగటమే కాక సకల కార్యసిద్ధి కలుగుతుందని భక్తుల విశ్వాసం. పద్మ, వామన పురాణాల ప్రకారం దేవలోక సేనాధిపతి కుమారస్వామి, రాక్షసుడైన తారకాసురుని సంహారం తర్వాత శాపవిమోచనం కోసం ప్రయత్నిస్తాడు. శివుని సూచన మేరకు శేషాచల పర్వాతాల్లోని వృషాద్రిలో తపస్సు చేశాడు. అనంతరం ఈ తీర్థంలో స్నానమాచరించి శాపవిమోచనం పొందాడు. సాక్షాత్తు కుమారస్వామి స్నానం చేయడం వల్ల ఈ తీర్థానికి కుమారధార అనే పేరు స్థిరపడిందంటారు. ఏటా కుంభమాసంలో ముఖానక్షత్రంతో కూడిన పౌర్ణమి రోజున టీటీడీ అర్చకబృందం తీర్థానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంది. భక్తులను ఆరోజు వేకువజాము నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అనుమతిస్తారు.

తుంబురు తీర్థం

ఫాల్గుణ మాసంలో ఉత్తరఫల్గుణీ నక్షత్రంతో కూడిన పౌర్ణమిరోజు తుంబుర తీర్థ ముక్కోటిని నిర్వహిస్తారు. ఈ పర్వదినాన తీర్థస్థానం చేస్తే దానధర్మాలు చేసి స్వామిని దర్శించుకున్నారు. ఈ తీర్థంలో తుంబురు నారద మహర్షి తపస్సు చేసి తరించిన స్థలం. తుంబురుడు దీనిలో స్నానం చేసి విష్ణులోకం చేరాడట. కాబట్టి ఈ తీర్థంలో ఫాల్గుణ శుద్ధ పౌర్ణమిరోజు స్నానం చేసినట్లయితే భక్తి జ్ఞానాలు కలిగి సర్వపాపాలు నశిస్తాయి. తిరుమల నుంచి ఏడున్నర కిలోమీటర్ల దూరం దట్టమైన అడవిలో ఎత్తైయిన కొండకోనలను ఎక్కి, దిగుతూతీర్థానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఏటా తుంబురు తీర్థముక్కోటి జరుగుతుంది.

రామకృష్ణతీర్థం

తిరుమలకు ఆరు కిలోమీటర్ల దూరంలో ఈ తీర్థం ఉంటుంది. ప్రతీ ఏటా మకరమాసంలో ఈ తీర్థ ముక్కోటిని టీటీడీ నిర్వహిస్తుంది. పుష్యమి నక్షత్రంతో కూడిన పౌర్ణమిరోజున అర్చకులు శాస్ర్తోక్తంగా పూజలు నిర్వహిస్తారు. పూర్వం వేంకటాద్రిలో రామకృష్ణుడనే ఒక మహర్షి కఠోర తపస్సుతో స్వామి కృపను పొందాడట. అందుకే దీని పేరు రామకృష్ణ తీర్థంగా సార్థకమైందని ప్రతీతి.

ఆకాశగంగ

తిరుమల నుంచి 3.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉంటుంది. ఆకాశరాజు తన కుమార్తె పద్మావతీదేవికి వేంకటేశ్వరస్వామితో వివాహం జరిపించే సందర్భంలో గంగను స్మరించి కన్యాదానం చేశారని స్కంద పురాణం తెలుపుతోంది. ఆకాశరాజు గంగను భూమికి రిప్పించిన ప్రదేశం కావడంతో దీనికి ఆకాశగంగ అనే పేరు వచ్చిందంటారు.

పాపవినాశనం

ఈ తీర్థంలో స్నానమాచరిస్తే పాపాలు తొలగి అభీష్టాలు నెరవేరతాయని ప్రతీతి. అందుకే పాపవినాశనం అని పేరు వచ్చింది. పూర్వంఈ తీర్థంలో జలధార ఉధృతంగా ఉండేది. 1989లో తిరుమల నీటి అవసరాల కోసం ఆనకట్ట కట్టారు. నీటి నిల్వ వల్ల ఆ తీర్థానికి వేళ్లేందుకు వీలు లేకపోవడంతో టీటీడీ కృత్రిమ తీర్థం నిర్మించి పుణ్యజలాన్ని భక్తులకు అందిస్తోంది. ఇక్కడ గంగాభవానీ, ఆంజనేయస్వామి వారి విగ్రహాలు ఉన్నాయి. తిరుమలకు 7.3 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ తీర్థానికి వాహ నాల్లోనే చేరుకోవచ్చు.

పాండవ తీర్థం

కురుక్షేత్ర సంగ్రామం సమాప్తం అయిన తరువాత పాండవులు బ్రహ్మహత్యా పాపాలు పోగొట్టుకోవడానికి ఈ తీర్థంలో స్నానం చేసి క్షేత్రపాలకుని పూజించి శ్రీనివాసుని దర్శించుకున్నారట. పాండవులు స్నానం చేసిన చోటు కావడంతో దీనికి పాండవ తీర్థం అనే పేరు వచ్చింది.

ఈ వార్తలు కూడా చదవండి..

సరికొత్త స్థాయికి బంగారం, వెండి ధరలు..

సంక్షేమమా సంక్షోభమా

Read Latest Telangana News and National News

Updated Date - Sep 21 , 2025 | 01:03 PM