Gold and Silver Prices Today: సరికొత్త స్థాయికి బంగారం, వెండి ధరలు..
ABN , Publish Date - Sep 21 , 2025 | 06:34 AM
దేశంలో బంగారం, వెండి కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి షాకింగ్ న్యూస్. ఎందుకంటే నిన్నటితో పోలిస్తే వీటి రేట్లు భారీగా పెరగడం విశేషం. ప్రస్తుతం వీటి ధరలు ఏ నగరాల్లో ఎలా ఉన్నాయనే విషయాలను ఇక్కడ చూద్దాం.
దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు మరోసారి సామాన్యులకు షాక్ ఇచ్చాయి. వీటి ధరలు (gold rates today) మళ్లీ పుంజుకున్నాయి. ఈ క్రమంలో నేడు (సెప్టెంబర్ 21న) ఉదయం 6 గంటల నాటికి హైదరాబాద్, ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.810 పెరిగి రూ.1,12,150కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,02,800కి చేరింది. ఇదే సమయంలో హైదరాబాద్, కేరళలో కేజీ వెండి ధర రూ.2,000 పెరిగి రూ.1,45,000కు చేరింది. ఇది గత రోజు (సెప్టెంబర్ 20)తో పోలిస్తే దాదాపు 2 శాతం పెరగుదల కావడం విశేషం.
ఇతర ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా
ఢిల్లీలో 24 క్యారెట్ 10 గ్రాములకు రూ.1,12,300, చెన్నైలో రూ.1,12,260, కోల్‌కతా, పూణేలో రూ.1,12,150, బెంగళూరు, వడోదరలో రూ.1,12,150 స్థాయిలో ఉంది. వెండి ధరలు బెంగళూరులో కేజీకి రూ.1,33,600. హైదరాబాద్, చెన్నై, కేరళలో రూ.1,45,000. ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, పూణే, వడోదరలో రూ.1,35,00గా ఉన్నాయి.
ధరలు ఎందుకు పెరిగాయి?
ప్రధాన కారణం ఫెస్టివల్ సీజన్ ప్రారంభం కావడం. దసరా, దీపావళి పండుగలు దగ్గరకు వచ్చాయి. ఇదే సమయంలో బంగారం కొనుగోళ్లు 37% పెరిగాయి. గ్లోబల్ స్థాయిలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్లు తగ్గించడం బంగారాన్ని ఆకర్షణీయమైన ఆస్తిగా మార్చింది. జియోపాలిటికల్ టెన్షన్లు, ఇన్‌ఫ్లేషన్ భయాలు కూడా రేట్లు పెరిగేందుకు ఓ కారణమని నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్తులో వీటి ధరలు ఇంకా పెరిగే ఛాన్స్ ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి