Benefits of Feeding Animals: మూగ జీవాలకు ఆహారం పెడితే.. కలిగే ప్రయోజనాలు..
ABN, Publish Date - Dec 18 , 2025 | 05:55 PM
మూగ జీవాలకు కాసింత ఆహారం, మంచి నీరు ఇస్తే పుణ్యం లభిస్తుందంటారు. కొన్ని జీవాలకు ఆహరం పెట్టడం వల్ల జీవితంలో ఇబ్బందులు తొలగిపోతాయని చెబుతున్నారు.
మూగ జీవాలకు ఆహారం అందిస్తే.. ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని పలు శాస్త్రాలు చెబుతున్నాయి. మరి ముఖ్యంగా ఆవు, కుక్క, చేపలు, కోతి, ఏనుగు తదితర జీవులకు ఆహారం తినిపించడం వల్ల పుణ్య ఫలం లభిస్తుందంటారు.
జీవ ఆవిర్భావం జరిగిన నాటి నుంచి జంతువులకు, మనుషులకు మధ్య విడదీయరాని సంబంధం ఏర్పడింది. ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే.. ఈ జీవుల్లో కొన్ని మనవుడి జీవితంలో భాగమైపోయాయి. ప్రతి పనిలో సహాయంగా ఉండడమే కాకుండా.. ఎప్పటికప్పుడు ఆవి మనిషి పట్ల విశ్వాసాన్ని చూపుతున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో జంతువులను పట్టించుకునే వారు కరువైపోతున్నారు. జోతిష్య శాస్త్రం ప్రకారం.. మూగ జీవాలకు ఆహారం అందిస్తే వివిధ ప్రయోజనాలు కలుగుతాయని అంటున్నారు.
శునకాలు..
శునకాలు.. కేతు గ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది. అందువల్ల మీ జీవితంలో ఏదైనా సమస్య ఉంటే.. లేదా పనులకు తీవ్ర అంతరాయం కలుగుతుంటే.. ప్రతి రోజు శునకాలకు ఆహారం పెట్టాలి. వీధి కుక్కలు అయినా సరే. అలా చేయడం వల్ల కేతు ప్రభావం తొలగిపోతుంది. అంతేకాకుండా.. ఇంట్లో కుక్కను పెంచుకోవడం వల్ల ప్రతికూల ప్రభావం సైతం దూరమవుతుంది.
చేపలకు ఆహారం పెట్టడం వల్ల..
చేపను శ్రీవిష్ణువు ప్రతిరూపంగా భావిస్తారు. ప్రతి రోజు ఉదయం చేపలకు ఆహారం పెట్టడం శుభకరంగా భావిస్తారు. ఇవి గురు గ్రహంతో సంబంధం కలిగి ఉంటాయి. ప్రతి రోజూ చేపలకు ఆహారం పెట్టడం వల్ల చెడు గ్రహాల ప్రభావం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇంట్లో సానుకూల శక్తి సైతం నెలకొంటుంది.
పిల్లులు..
రాహువుతో కనెక్ట్ అయి ఉంటాయి. పిల్లులు ఎదురు రావడాన్ని కొందరు అశుభంగా పరిగణిస్తారు. అందులో వాస్తవం లేదు. కేతు లేదా రాహు గ్రహం కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. ప్రతి రోజూ పిల్లులకు ఆహారం అందించడం వల్ల శుభం జరుగుతుంది. అలాగే పిల్లులను కొట్టడం, తిట్టడం వంటివి చేయకూడదు.
ఆవు..
ఆవును శ్రీలక్ష్మీదేవి ప్రతిరూపంగా పూజిస్తారు హిందూ ధర్మం ప్రకారం గోవును తల్లిగా గౌరవిస్తారు. ప్రతి శుక్రవారం ఆవుకు పచ్చి గడ్డి తినిపిస్తే.. ఆ మహాలక్ష్మీ దయ చూపిస్తుందంటారు. అంతేకాదు ఇంట్లో శుభం జరుగుతుందని చెబుతారు. నల్ల ఆవుకు ఆహారం అందించడం వల్ల శని అరిష్ట ప్రభావం సాధ్యమైనంతగా తగ్గుతాయని చెబుతారు.
ఏనుగు..
ఏనుగు సైతం లక్ష్మీదేవితో సంబంధం కలిగి ఉంటుంది. వీటికి ఆహారం అందించడాన్ని పవిత్రంగా భావిస్తారు. ఏనుగు.. గురు గ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది. నగదు సమస్యలు ఎదుర్కుంటుంటే.. ఏనుగుకు ఆహారం ఇవ్వడం శుభమని చెబుతారు. ఒక వేళ ఏనుగుకు ఆహారం అందించలేకున్నా.. దాని ఫొటోను ఇంట్లో పెట్టుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుందని అంటారు.
కోతి..
కోతిని హనుమంతుడికి ప్రతిరూపంగా భావిస్తారు. వీటికి ఆహారం పెట్టడాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. వీటికి అంగారక గ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది. వీటికి అరటి పండ్లు అంటే అమితమైన ఇష్టం. ప్రతి మంగళవారం కోతులకు అరటి పండ్ల పెట్టడం వల్ల చాలా మంచి జరుగుతుంది. జీవితంలో సానుకూల ఫలితాలు అందుతాయని చెబుతారు.
Updated Date - Dec 18 , 2025 | 05:56 PM