Sunday Amavasya: వచ్చే ఆదివారం అమావాస్యకి అంత పవర్ ఉందా..?
ABN, Publish Date - Sep 16 , 2025 | 09:52 AM
ఈ ఏడాది మహాలయ పక్షాలు చంద్ర గ్రహణంతో ప్రారంభమైంది. ఈ పక్షాలు సూర్య గ్రహణంతో ముగియనున్నాయి. ఈ సారి మహాలయ పక్ష అమావాస్య ఆదివారం వచ్చింది.
అమావాస్య అంటేనే.. తెలుగు ప్రజలు కొద్దిగా సందేహిస్తారు. ఆ రోజు శుభ ముహూర్తాలు సైతం లేవని జోతిష్య పండితులు కరాఖండిగా చెప్పేస్తారు. ఇక ఆ రోజు.. శుభకార్యాలు సైతం పెట్టుకోరు. ఒక వేళ అమావాస్య రోజు వచ్చినా వాటిని ఆ మరునాడో.. ఇంకో రోజో పెట్టుకుంటారు. అదీకాక అమావాస్య.. మంగళవారం, శుక్రవారం, ఆదివారాల్లో వస్తే పలువురు ప్రయాణం కానీ, శుభకార్యం కానీ మరే ఇతర కార్యక్రమమైనా నిస్సందేహంగా వాయిదా వేసేస్తారు.
మంగళ, శుక్రవారాల్లో ఏమో కానీ.. ఆదివారం అమావాస్యకి చాలా పవర్ ఉంటుందని పలువురు భావిస్తుంటారు. అయితే ఈ ఏడాది సెప్టెంబర్ 21వ తేదీ ఆదివారం వచ్చింది. అందునా పితృపక్షాల్లో చివరి రోజు వచ్చింది. అదే రోజు సూర్య గ్రహణం సైతం వచ్చింది. ఈ నేపథ్యంలో ఆ రోజు సూపర్ పవర్ ఫుల్ అని జోతిష్య పండితులు చెబుతున్నారు. ఈ అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఉంటుందని పేర్కొంటున్నారు. మరి ముఖ్యంగా పితృదేవతలకు తర్పణాలు సమర్పిస్తారు. ఆ రోజు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.
మహాలయ పక్షాల్లో పెద్దలను గుర్తు చేసుకుంటారు. మహాలయ అమావాస్య రోజు పిండ ప్రదానం చేయడానికి ప్రత్యేకమైన రోజు. ఈ రోజు పితృదేవతలకు తర్పణాలు సమర్పిస్తే.. పాపాలు తొలగి.. ఇంట్లో శుభం జరుగుతుందంటారు. అందుకే ఆ రోజు పితృదేవతలకు పిండ ప్రదానం చేసి.. అన్నదానం చేయాలని పేర్కొంటారు. అలా చేసిన వారికి మంచి జరుగుతుందంటారు.
అలాగే ఈ అమావాస్య రోజు.. విష్ణువు, శివుడిని పూజించడం వల్ల మేలు జరుగుతుందని అంటారు. ఆ రోజు తెల్లవారుజామున నిద్ర లేచి.. నది స్నానం చేయడం మేలు జరుగుతుందని స్పష్టం చేస్తున్నారు. ఇక ఈ రోజు కొన్ని చేయవద్దని సూచిస్తు్న్నారు. దూర ప్రయాణాలు చేయవద్దని సూచిస్తున్నారు. అలాగే అమావాస్య రోజు.. శుభకార్యాలే చేయకపోవడమే కాదు.. కొత్త వస్తువులు సైతం కొనుగోలు చేయరన్న సంగతి అందరికి తెలిసిందే.
(గమనిక.. ఈ వార్తల్లో ఇచ్చిన సమాచారం కేవలం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. జోతిష్య పండితుల సూచనలు, సలహా మేరకు వారు వివరించిన అంశాల ఆధారంగా అందించినవి. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాల్సి ఉంటుంది. )
ఈ వార్తలు కూడా చదవండి..
మళ్లీ గ్రహణం.. ఈ రాశుల వారికి జాక్‌పాట్
తెలంగాణలో బొడ్డెమ్మ పండుగ సంబరాలు
For More Devotional News And Telugu News
Updated Date - Sep 16 , 2025 | 12:48 PM